The Rajasaab: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ల కాంబినేషన్‌కి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఏక్ నిరంజన్’, ‘బుజ్జిగాడు’ లాంటి పక్కా మాస్ ఎంటర్‌టైనర్స్ అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలతో ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ వస్తుందనుకున్నారు.
కానీ, ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. పూరి కూడా హిట్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవలే, కోలీవుడ్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తో ఓ మాస్ ఎంటర్‌టైనర్ తెరకెక్కిస్తున్నారు. మలయాళ బ్యూటి సంయుక్త మేనన్ హీరోయిన్‌గా.. టబు, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి స్టైల్లో షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతోంది.
సోషల్ మీడియాలో పూరి-ప్రభాస్ పిక్ వైరల్..
అయితే, సోషల్ మీడియాలో ప్రస్తుతం పూరి జగన్నాధ్, ప్రభాస్ ల పిక్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సెట్స్ కి పూరి, ఛార్మి వెళ్ళి కాసేపు సరదాగా సందడి చేశారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ ని కలుసుకున్న పూరి.. హగ్ చేసుకొని ఎంతో ఆప్యాయంగా మాట్లాడి విష్ చేశారు. ఈ సందర్భంలో తీసిన పిక్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, “మంచి కథ ఉంటే చెప్పు డార్లింగ్ సినిమా చేసేద్దాం”..అంటూ ప్రభాస్ అడిగినట్టు తెలుస్తోంది.
చిరుతో చేయాల్సిన ‘ఆటోజానీ’ కథే ఇది..?
మెగాస్టార్ చిరంజీవితో పూరి జగన్నాధ్ ‘ఆటోజానీ’ టైటిల్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, సెకండాఫ్ మెగాస్టార్ ని అంతగా ఆకట్టుకోలేపోవడంతో ప్రాజెక్ట్ కుదరలేదు. ఆ తర్వాత చాలాసార్లు కలిసి సినిమా చేయాలనుకున్నప్పటికీ, సెట్ కాలేదు. యంగ్ డైరెక్టర్స్ అందరికీ మెగాస్టార్ ఛాన్స్ ఇస్తున్నారు కానీ, పూరి కి మాత్రం ఇంకోసారి ఛాన్స్ ఇవ్వలేదంటున్నారు. కానీ, కథ నచ్చితే పూరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం.
ప్రస్తుతం విజయ్ సేతుపతితో చేస్తున్న సినిమా కథ నిజంగా ‘ఆటోజానీ’ కథే అయితే గ్యారెంటీగా అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికే, చాలా కాంబినేషన్స్ మారి సినిమాలు సక్సెస్ అయినవి ఎన్నో ఉన్నాయి. చిరుతో చేయాల్సిన ఆటోజానీ విజయ్ తో చేసి పూరి హిట్ కొడితే ఆ లెక్క ఖచ్చితంగా ఇంకోలా ఉంటాయి. చూడాలి మరి, ఈ మూవీ నుంచి అప్‌డేట్స్ మొదలైతే గానీ, ఆ కథ ఏంటనేది ఓ క్లారిటీ వస్తుంది.
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
This website uses cookies.