The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఆయన అభిమానులే కాదు, సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన క్రేజ్‌ని దృస్టిలో పెట్టుకుని బడా నిర్మాణ సంస్థలు డార్లింగ్ తో భారీ బడ్జెట్ కేటాయించి సినిమాలు నిర్మిస్తున్నాయి. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ప్రకటన రాలేదు గానీ, లైన్‌లో ఉన్నాయి. పీపుల్ మీడియా సంస్థ ప్రభాస్‌తో ది రాజా సాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నారు. ముఖ్యంగా ఘోస్ట్‌గా కనిపించి అదరగొట్టబోతున్నాడని సమాచారం. తాత – మనవడి పాత్రల్లో ప్రభాస్ కనిపించనున్న విషయం బయటకి వచ్చినప్పటి నుంచి ప్రతీ ఒక్కరిలో ఆసక్తి ఇంకా పెరిగింది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ నటిస్తున్నారు. కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటులు సంజయ్‌దత్, అనుపమ్ ఖేర్ కనిపించనున్నారు. ఇక స్టార్ హీరోయిన్ నయనతార స్పెషల్ సాంగ్‌లో కనిపించడం మరో హైలెట్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న రాజా సాబ్ మూవీ నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు.
ఇప్పటికే, సినిమాకి సంబందించిన చిత్రీకరణ మొత్తం పూర్తైందట. కానీ, ప్రభాస్ మాత్రం ఇంకా డబ్బింగ్ చెప్పలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన విదేశాలలో ఉన్నారు. ఎప్పుడు వస్తారో క్లారిటీ లేదు. ఆయన వచ్చి గనక డబ్బింగ్ చెప్పేస్తే రాజా సాబ్ ప్రమోషన్స్ మొదలవుతాయి. ఈ నెలలోనే టీజర్ రిలీజ్ చేయాలని భావించిన మేకర్స్ ప్రకటించారు కూడా. కానీ, ప్రభాస్ డబ్బింగ్ చెప్పకపోవడం వల్లే అది వీలవడం లేదని తెలుస్తోంది. కాగా, టీజర్..గ్లింప్స్‌తో రాజా సాబ్ మూవీపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇది కాకుండా ఫౌజీ, స్పిరిట్, సలార్ 2 చిత్రాలు చేయాల్సి ఉంది ప్రభాస్.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.