Pawan Kalyan: అన్నీ వరుసబెట్టి పూర్తి చేస్తున్న పవర్ స్టార్..!

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో చాలా బిజీగా ఉన్నారు. ఎక్కువగా ఆయన ప్రజల సమస్యల మీద దృష్టి సారించి వాళ్ళ సమస్యలను పరిష్కరించే పనుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు ఇన్నాళ్ళు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకవైపు దర్శకనిర్మాతలు మరోవైపు ఆయన అభిమానులు సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిర్మాతల ఇబ్బందులను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వీలైంత త్వరగా ఆయన నటిస్తున్న సినిమాలను పూర్తి చేయడానికి డేట్స్ ఇచ్చేశారు.

pawan-kalyan-the-power-star-who-is-putting-everything-in-order-and-completing-it

Pawan Kalyan: ఫ్యాన్స్ చేసుకోవడాని సంబరాలే సంబరాలు.

ఇప్పటికే, హరిహర వీరమల్లు చిత్రానికి సంబందించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. త్వరలో ఓ.జీ చిత్రం షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. వీరమల్లు సినిమా ప్రమోషన్స్ కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు. సుజీత్ తెరకెక్కిస్తున్న ఓ.జీ కూడా కొద్దిపాటి చిత్రీకరణతో పూర్తి కానుంది. ఇది పూర్తైతే దీనికి సంబందించిన అప్‌డేట్స్ కూడా వరుసగా రాబోతున్నాయి. ప్రియాంక అరుళ్ మోహన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

pawan-kalyan-the-power-star-who-is-putting-everything-in-order-and-completing-it

ఇక గబ్బర్‌సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉసాద్ భగత్‌సింగ్ సినిమాకి మాత్రం ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవన్ గనక కాస్త సర్దుబాటు చేసుకొని డేట్స్ ఎక్కువగా కేటాయిస్తే చిత్రీకరణ మొత్తం ఈ ఏడాదే పూర్తి కావచ్చు. ఇప్పటికే, కొంతభాగం చిత్రీకరణ కూడా జరిపారు. ఈ నిర్మాతలకి పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తి చేస్తానని మాటిచ్చారు. కాబట్టి ఒక్కసారి పవన్ కళ్యాణ్‌కి సంబందించిన టాకీపార్ట్, సాంగ్స్ పూర్తైతే వరుసగా రిలీజ్ ప్లాన్సే ఉంటాయి. ఫ్యాన్స్ చేసుకోవడాని సంబరాలే సంబరాలు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.