Health: ప్రస్తుతం సమాజంలో సాంకేతిక ఓ వైపు అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఉంటే అంతే స్థాయిలో మనుషుల జీవితాలు, ప్రాణాలతో చెలగాటం ఆడే డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుంది. మనిషి వ్యసనాల మీద వ్యాపారాలు చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఓ వైపు సిగరెట్, మద్యం ప్రత్యక్షంగా జరుగుతూ ఉంటే పరోక్షంగా డ్రగ్స్ దందా నడుస్తుంది. ఈ వ్యసనాల కారణంగా సమాజంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్న వాటిని కంట్రోల్ చేయడంలో మాత్రం ప్రభుత్వాలు సక్సెస్ కావడం లేదు.
అలాగే ప్రజలు కూడా వ్యసనాల బారి నుంచి బయటపడలేకపోతున్నారు. ముఖ్యంగా సిగరెట్ ఎంత ప్రాణాంతకమో తెలిసి కూడా చాలా మంది దానికి బానిసై క్యాన్సర్, గుండె సంబంధిత రోగాల బారిన పడుతున్నారు. సిగరెట్ వలన జరిగే ఘోరాలపై ఓ వైపు అవగాహన కల్పిస్తున్నా కూడా ప్రజలు వాటి నుంచి దూరం కాలేకపోతున్నారు.
ఈ మధ్యకాలంలో ఆడవాళ్లు కూడా సిగరెట్ తాగడం అలవాటుగా చేసుకున్నారు. సిగరెట్ ని చాలా మంది స్టేటస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ సిగరెట్ ప్రతిక్షణం వాళ్ళ ఆయుష్షు ఎంత తగ్గిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్ లో పడ్డప్పుడు కాని వాస్తవం బోధపడదు. ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ ద్వారా పొగాకు తాగేవారి సంఖ్య మిలియన్స్ లో ఉందటే అతిశయోక్తి కాదు.
అదే సమయంలో ఈ సిగరెట్ పొగ కారణంగా ప్రతి సంవత్సరం చనిపోయే వారు, హాస్పిటల్ లో చేరేవారు కూడా అధికంగానే ఉన్నారు. దేశంలో 29 శాతం మంది యువత సిగరెట్ కి బానిసలుగా మారిపోయారని సర్వేలు చెబుతున్నాయి. సిగరెట్ తాగేవారి ఆరోగ్యంతో పాటు వారి కారణంగా చుట్టూ ఉండి ఆ పొగ పీల్చేవారు కూడా అనారోగ్యాల బారిన పడుతున్నారు. పొగాకు తాగే వారు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు.
తరువాత గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో సతమతం అయ్యేవారు కూడా ఉన్నారు. ఇదిలా ఒక్క సిగరెట్ త్రాగడం మానేస్తే మన ఆయుష్షులో 30 సెకండ్స్ కాలాన్ని పొడిగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సిగరెట్ తాగేవారి తమ ఆయుష్షుని ప్రతి సిగరెట్ పై 30 సెకండ్స్ తగ్గించుకుంటున్నారని దీనిని బట్టి తెలుస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.