TDP PARTY: టీడీపీ నెక్స్ట్ జనరేషన్ క్వీన్స్.. స్కెచ్ అదిరిందిగా!

TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంటుంది. అయితే ఈసారి పొలిటికల్ స్క్రీన్ పైకి వస్తున్న చేంజ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అమలు కానున్న మహిళా రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని, తెలుగుదేశం పార్టీ ఒక భారీ మాస్టర్ ప్లాన్‌కు తెరలేపింది. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగినప్పుడు మహిళా అభ్యర్థుల కొరత లేకుండా చూసేందుకు.. ఇప్పటి నుంచే నెక్స్ట్ జనరేషన్ క్వీన్స్‌ ను గ్రౌండ్ లోకి దించుతోంది. కేవలం పేరుకే వారసులుగా కాకుండా, సబ్జెక్ట్ నాలెడ్జ్, మైక్ పడితే అదరగొట్టే వాగ్ధాటి ఉన్న యువతను చంద్రబాబు, లోకేష్ లు లైన్ లోకి తెస్తుండడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా పెద్ద లీడర్ల కూతుళ్లు అంటే విదేశాల్లో చదువుకుని, బిజినెస్ లు చూసుకుంటూ ప్రైవేట్ లైఫ్ కే పరిమితం అవుతారని అనుకుంటారు. కానీ, టీడీపీలోని యంగ్ జనరేషన్ లేడీస్ ఆ అంచనాలను బ్రేక్ చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవి ఆల్రెడీ నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. మీడియా ముందుకు వచ్చి ఆమె మాట్లాడుతున్న తీరు, పార్టీ కేడర్‌ను నడిపిస్తున్న శైలి చూస్తుంటే.. ఫ్యూచర్ లో ఆమె ఒక పవర్‌ఫుల్ లీడర్ కాబోతోందని స్పష్టమవుతోంది.

tdp-party-tdp-next-generation-queens-the-sketch-is-amazing

TDP PARTY: క్వాలిటీస్ ఉన్న యువ టీమ్‌నే టీడీపీ ఇప్పుడు రెడీ చేస్తోంది.

ఇక తాజాగా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తి పెళ్లి వేడుకలో మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్స్ ఈ వ్యూహాన్ని మరింత బహిర్గతం చేశాయి. “మహిళా రిజర్వేషన్ వస్తోంది.. ఎమ్మెల్యే కావడానికి రెడీగా ఉండు” అని లోకేష్ ఆమెకు హింట్ ఇవ్వడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కేవలం వీరే కాదు.. పార్టీ కోసం పనిచేసే ఇతర అనుబంధ విభాగాల నుంచి కూడా చురుకైన, చదువుకున్న యువతులను గుర్తించేందుకు టీడీపీ ఒక ప్రత్యేక అసెస్‌మెంట్ డ్రైవ్ కూడా నడుపుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

రాజకీయాల్లో కేవలం వారసత్వం చెబితే సరిపోదు.. ప్రజలను ఆకట్టుకునే మాటకారి తనం, ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేసే సబ్జెక్ట్ ఉండాలి. సరిగ్గా ఇలాంటి క్వాలిటీస్ ఉన్న యువ టీమ్‌నే టీడీపీ ఇప్పుడు రెడీ చేస్తోంది. నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తారని చెబుతుంటారు. ఇప్పుడు మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడం వెనుక కూడా అదే పెద్ద స్కెచ్ ఉంది. ఈ కొత్త తరం నాయకురాళ్లకు నేరుగా అసెంబ్లీ టికెట్లు ఇచ్చేయకుండా.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వీరికి ఒక అగ్నిపరీక్షగా మార్చబోతున్నార‌ట‌. లోకల్ బాడీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో తిరిగి, ప్రజల సమస్యలపై పట్టు సాధించి, తమ సత్తా చాటుకున్న వారికే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ రేసులో ఛాన్స్ దక్కేలా రూల్స్ సెట్ చేస్తున్నారు.

అసెంబ్లీలోనూ, అటు సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ వాయిస్ ను బలంగా వినిపించగల ఒక స్మార్ట్ లేడీస్ బ్రిగేడ్ ను చంద్రబాబు, లోకేష్ ద్వయం సిద్ధం చేస్తోంది. చదువుకున్న యువతులు నేరుగా గడపగడపకూ వెళ్తుండడంతో ఓటర్లు కూడా కనెక్ట్ అవుతున్నారు. మొత్తానికి టీడీపీ నెక్స్ట్ జనరేషన్ క్వీన్స్ ను రంగంలోకి దించుతూ బాబు వేసిన ఈ పక్కా పొలిటికల్ స్కెచ్.. భవిష్యత్తులో ఏపీ పాలిటిక్స్ లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

4 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.