Taraka Ratna: టాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు తారకరత్న. అయితే నటుడిగా ఉన్నత స్థానాలు అందుకోకుండానే, రాజకీయ నాయకుడుగా ప్రస్థానం మొదలు పెట్టకుండానే గుండెపోటుతో మృతి చెంది అందరికి విషాదాన్ని మిగిల్చాడు. నందమూరి కుటుంబం నుంచి హీరోగా అడుగుపెట్టిన తారకరత్న ఎంట్రీ ద్వారా అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఏకంగా తొమ్మిది సినిమాలని ప్రారంభించాడు. ఆ రోజుల్లో ఇది సంచలనం అని చెప్పాలి. అయితే హీరోగా ప్రారంభించిన అన్ని సినిమాలలో నటించిన కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ ని మాత్రం తారకరత్న అందుకోలేకపోయాడు.
తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అమరావతి సినిమాలో విలన్ గా మెప్పించాడు. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాకుండా తారకరత్నకి కూడా నంది అవార్డు తీసుకొచ్చింది. ప్రస్తుతం నటుడిగా విభిన్నమైన పాత్రలని ఎంపిక చేసుకుంటూ తారకరత్న తన నట ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మధ్య రాజకీయాలలోకి అడుగుపెట్టిన తారకరత్న ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని కలలు కన్నాడు. దీనిపై చంద్రబాబు, నారా లోకేష్ తో హామీ కూడా లభించింది. ఇక వచ్చే ఎన్నికలలో గుడివాడ నియోజకవరం నుంచి తారకరత్నని ఎమ్మెల్యేగా బరిలో దింపాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం కూడా జరిగిపోయినట్లు తెలుస్తుంది. ఇక కొడాలి నానికి పోటీగా తారకరత్న అయితే గట్టి పోటీ ఉంటుందని చంద్రబాబు భావించినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో తెలుగు దేశం పార్టీ కార్యక్రమాలలో తారకరత్న గత కొన్ని నెలలుగా చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ఈ రాజకీయ ఒత్తిడిని అలాగే పాదయాత్ర సమయంలో విపరీతమైన జన సందోహంలో శారీర అలసటకి గురికావడం జరిగిందని తెలుస్తుంది. కుప్పంలో లోకేష్ పాదయాత్రకి రెండు రోజుల ముందు నుంచి ఆయన నిరాశంగా ఉన్నారని సన్నిహితులు చెబుతున్న మాట. అయితే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి పాదయాత్రలో పాల్గొనడమే అతని మరణానికి కారణం అయ్యిందనే మాట వినిపిస్తుంది.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.