Talambralu: పెళ్లి అంటేనే ఎన్నో ఆచార సంప్రదాయాలతో కూడుకున్నదని చెప్పాలి.పెళ్లిలో ఎన్నో ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ పెద్ద ఎత్తున ఈ వేడుకను నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో చేసే పెళ్లిళ్లలో మాత్రం కేవలం ఫోటోలు డెకరేషన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం పాటించాల్సిన ఆచార సాంప్రదాయాలను పాటించకపోవడం జరుగుతుంది.కానీ ఇప్పటికీ పెళ్లిళ్లలో మాంగల్యధారణ తర్వాత వధూవరులు తలంబ్రాలు పోసుకోవడం మనం చూస్తుంటాము. ఇలా తలంబ్రాలు పోసుకోవడానికి కారణం ఏంటి ఈ ఆచారం ఎందుకు పాటించాలని విషయానికి వస్తే….
పెళ్లిలో మాంగల్య ధారణ తర్వాత పురోహితుడు వధూవరుల చేతులను దర్భలతో తుడిచి వారి దోసెలలో పసుపుతో కలిపిన తలంబ్రాలను ఇస్తారు. ఆపై ఆ తలంబ్రాలపై పాలను పోసి ముందుగా వరుడు వధువు తలపై తలంబ్రాలు పోయమని చెబుతారు. మన భాషలో తలంబ్రాలు అంటే అక్షతలు తలంబ్రాలు అంటే తల యందు పోయబడే ప్రాలు అని అర్థం. ఇలా వరుడు వధువు తలపై తలంబ్రాలు పోసే సమయంలో పురోహితుడు వధువు తన వంశాభివృద్ధిని కలిగించాలని శాంతి సంతోషాలతో ఉండాలని మంత్రాలను చదువుతారు.
ఇక వరుడు వధువు తలపై తలంబ్రాలు పోయడం వెనుక ఉన్న కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఓ వధువా… నీవు మా ఇంటికి వచ్చాక మన ఇంట కూడా ధాన్యం ఇలా కుప్పలు తెప్పలుగా విరివిగా ఉండి మన జీవనానికి ఆధార భూతమైన ధాన్యంతో మనం నిత్యం సంపదలను కలిగి ఉండాలని వరుడు చెబుతూ వధువు తలపై తలంబ్రాలు పోస్తారు. ఇలా పెళ్లిలో వధూవరులు తలంబ్రాలు పోసుకోవడం వెనుక ఇంతటి వ్యవహారం ఉందనే చెప్పాలి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.