Swollen Feet: గర్భం దాల్చిన మహిళలు నెలలు పెరిగే కొద్దీ పాదాల వాపు రావడం సర్వసాధారణం. ఇలా గర్భిణీ స్త్రీలలో పాదాల వాపు రావటం వల్ల కడుపులో బిడ్డకు ఏదైనా హాని జరుగుతుందేమోనని ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ విధంగా పాదాల వాపు సమస్య కారణంగా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎలాంటి హాని జరగదు. అయితే గర్భిణీ స్త్రీలకు మాత్రం కాస్త అసౌకర్యంగా ఉంటుంది. మరి ఈ పాదాల వాపు సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి.
మరి గర్భిణీ స్త్రీలు పాటించాల్సినటువంటి ఆ చిట్కాలు ఏంటి అనే విషయానికి వస్తే…గర్భిణీ స్త్రీలలో శరీర బరువు పెరుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఎక్కువసేపు కూర్చున్న ఎక్కువసేపు నిలబడిన ఆ బరువు మొత్తం పాదాలపై పడటం వల్ల పాదాల వాపు అనేది వస్తుంది.కూర్చున్న సమయంలో కూడా రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల కూడా వాపు వస్తుంది.అందుకే గర్భిణీ స్త్రీలు ఎక్కువ సేపు నిలబడకుండా ఎక్కువ సేపు కూర్చోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రతి అరగంటకు ఒకసారి బ్రేక్ తీసుకొని కాసేపు నడవడం లేదా విశ్రాంతి తీసుకోవడం చేయాలి.గర్భిణీ స్త్రీలు పగలు రెండు గంటలసేపు విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే రోజుకు 45 నిమిషాల పాటు నడక కూడా ఎంతో మంచిది. అంతేకాకుండా ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంతేకాకుండా శరీరాన్ని ఎప్పుడు హైడ్రేట్ గా ఉంచడం కోసం తరచూ నీటిని త్రాగుతూ ఉండాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ పాదాల వాపు సమస్య నుంచి బయటపడవచ్చు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.