Suresh Kondeti : సురేష్ కొండేటి ఆటలకు బ్రేక్..మెగా ఫ్యామిలీ బిగ్ షాక్

Suresh Kondeti : గోవాలో జరిగిన సంతోషం అవార్డుల వేడుక గురించిన వివాదం ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ లా మారింది . అవార్డుల వేడుకలో సెలబ్రిటీల రిసీవింగ్ కి సంబంధించి ఒక్కో కథనం పోస్ట్ అవుతుంది. సురేష్ కొండేటి ఈవెంట్ నిర్వహించిన తీరు అసలు బాగోలేదని తెలుగేతర పరిశ్రమలకు చెందిన స్టార్స్ పెదవి విరుస్తున్నారు. సురేష్ కొండేటి పుణ్యమా సినిమా అభిమానులు టాలీవుడ్‌ను ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ఆడిపోసుకుంటున్నారు. ఇంతకీ అసలు జరిగిన విషయం ఏంటి ఇంతలా ఇండస్ట్రీపై రూమర్స్ రావడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

suresh-kondeti-mega-family-gave-big-shock

సంతోషం సురేష్ కొండేటి గోవాలో ఘనంగా సంతోషం అవార్డుల ఉత్సవాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేశాడు. ఈవెంట్ కు ఏకంగా గోవా సీఎంనే చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు . సౌత్ భాషల సినిమా అవార్డులతో పాటు ఓటీటీ అవార్డులు ఇవ్వాలని పూనుకున్నారు.నిజానికి సంతోషం అవార్డులు ఎప్పుడు హైదరాబాద్లోనే జరిగేవి కానీ ఈసారి డిఫరెంట్ గా గోవాలో ప్లాన్ చేశారు సురేష్. దీంతో భాగ్యనగరం నుంచి భారీగా సెలబ్రిటీస్ ఈవెంట్ కు తరలివచ్చారు. కానీ అవార్డుల ఫంక్షన్ మొత్తం అబాసుపాలై టాలీవుడ్ పరువు పోయినట్లయింది. అంతేకాదు ఈవెంట్ చూసేందుకు వెళ్లిన సినిమా జనాలకు కూడా అక్కడ చేదు అనుభవాలు ఎదురైనట్టు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది.

suresh-kondeti-mega-family-gave-big-shock

అవార్డుల వేడుకలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అవార్డులు ముగిసిన వెంటనే స్టేజ్ పైకి వెళ్లే మెట్ల తో పాటు లైట్లను ఆపేశారు. దీనితో ఒక్కసారిగా ఫంక్షన్ కు వచ్చిన వారంతా షాక్ అయ్యారు. పేమెంట్లు ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని రమర్స్ వస్తున్నాయి. హోటల్ నుంచి అవార్డుల వేడుక వేదిక దగ్గరికి వెళ్లే ఏర్పాట్లు కూడా స‌రిగా లేవ‌ని సమాచారం… ఆఖరికి గెస్టులను తీసుకువెళ్లే ట్యాక్సీ డ్రైవర్లు కూడా పేమెంట్లు ఇవ్వలేదని గొడవకు దిగారట. భారీరే రిటర్న్ ఫ్లైట్‌ టికెట్లు వేసుకొని కొంతమంది సెలబ్రిటీలు వెనక్కి వచ్చారని టాక్. అల్లు అరవింద్, దామోదర ప్రసాద్ లాంటివారు కొన్ని పేమెంట్లు చేశారని సమాచారం. సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. హోటల్ బిల్లులు కూడా చెక్ అవ్వలేదని అంటున్నారు. ఈ క్రమంలో యాంకర్ సుమ కూడా ఫంక్షన్ మధ్యలోనే వెళ్లిపోయినట్టు తెలుస్తుంది.

suresh-kondeti-mega-family-gave-big-shock

ఇదిలా ఉంటే సురేష్ కొండేటికీ మెగా ఫ్యామిలీ పర్సనల్ పీఆర్వోగా అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. సురేష్ మెగాస్టార్ చిరంజీవికి సొంత పిఆర్ఓ అని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు. దీంతో సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ గజిబిజిగా మారడంతో ఇదంతా మెగా ఫ్యామిలీ వీఆర్వో కారణంగానే జరిగిందంటూ మెగా ఫ్యామిలీని ఈ ఇష్యూ లోకి లాగుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ ఈ రూమర్స్ పై రియాక్ట్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ, అవార్డులు ఫంక్షన్ నిర్వహించడంలో సురేష్ ఫెయిల్యూర్ అయ్యాడని ఇది తన వ్యక్తిగత విషయమని ఇందులో మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని కొన్ని పేపర్స్ కావాలని మెగా ఫ్యామిలీ పిఆర్ఓ ఇలా చేశాడంటూ వార్తలు రాస్తున్నాయని ఆయన అన్నారు. సురేష్ మా పిఆర్ఓ కాదు.పైగా ఈ ఫంక్షన్ వల్ల ఇతర భాషల వారికి ఇబ్బందులు కలిగాయి.. వారు టాలీవుడ్ ని విమర్శిస్తున్నారు.. ఒక వ్యక్తి చేసిన పొరపాటును ఇండస్ట్రీకి ఆపాదించడం కరెక్ట్ కాదు అని అన్నారు. ఇప్పటి వరకు సురేష్ మెగా ఫ్యామిలీ పిఆర్ఓ అని చెప్పుకోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. అయితే ఇప్పటినుంచి ఆ పప్పులేమి ఉడకవు.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

6 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

6 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.