Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. ఇలా స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో టీటీడీ అధికారుల సైతం భక్తుల సౌకర్యాల కోసం ఇప్పటికే ఎన్నో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరొక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. స్వామివారి దర్శనం కోసం కొండపైకి వచ్చే భక్తులు గదుల కోసం ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా టిటిడి మరిన్ని మార్పులు చేసింది.గతంలో సీఆర్వో (CRO) కార్యాలయం వద్ద గదుల కోసం భక్తులు గంటలు తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి అయితే ఈ విధానానికి టీటీడీ స్వస్తి పలుకుతూ కొత్త విధానాన్ని అమలు చేస్తుంది.
తాజాగా ఉపవిచారణ కార్యాలయాల’ (సబ్ ఎంక్వైరీ ఆఫీస్) ద్వారా గదులను కేటాయించే పద్ధతిని అమల్లోకి తీసుకువచ్చింది. కొండపై గదులు కావాల్సినటువంటి భక్తులు సీఆర్వో కార్యాలయం వద్ద ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి అందుబాటులో ఉంటున్నాయి. గదులు కావలసినవారు ఉదయం ఐదు గంటల నుంచి సి.ఆర్.ఓ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.భక్తుల ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ సహాయంతో అత్యాధునిక ‘ఫేస్ రికగ్నిషన్’ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కౌంటర్ వద్ద భక్తులకు రెండు కేటగిరీల గదులను చూపిస్తారు. మనకు నచ్చిన క్యాటగిరీని ఎంపిక చేసుకున్న తర్వాత భక్తులకు ఒక రసీదును చెల్లిస్తారు.రిజిస్ట్రేషన్ పూర్తయిన భక్తుల నంబర్లు సీఆర్వో ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డులపై కనిపిస్తాయి. బోర్డుపై భక్తుల క్రమ సంఖ్య వచ్చిన 15 నిమిషాల లోపు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు గదికి సంబంధించిన పూర్తి వివరాలతో సమాచారం వస్తుంది. ఒకవేళ ఇలాంటి సమాచారం గనక అందకపోతే అక్కడే ఏర్పాటు చేసిన ‘కియోస్క్ యంత్రాల’ వద్ద భక్తులు తమ వద్ద ఉన్న ఎక్నాలెడ్జ్‌మెంట్ రశీదును స్కాన్ చేస్తే వారి రూమ్ కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి అవుతాయి. ఇలా ఈ కొత్త విధానం ద్వారా ఇకపై గదుల కోసం భక్తులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని చెప్పాలి.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.