Suresh Kondeti : గోవాలో జరిగిన సంతోషం అవార్డుల వేడుక గురించిన వివాదం ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ లా మారింది . అవార్డుల వేడుకలో సెలబ్రిటీల రిసీవింగ్ కి సంబంధించి ఒక్కో కథనం పోస్ట్ అవుతుంది. సురేష్ కొండేటి ఈవెంట్ నిర్వహించిన తీరు అసలు బాగోలేదని తెలుగేతర పరిశ్రమలకు చెందిన స్టార్స్ పెదవి విరుస్తున్నారు. సురేష్ కొండేటి పుణ్యమా సినిమా అభిమానులు టాలీవుడ్‌ను ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ఆడిపోసుకుంటున్నారు. ఇంతకీ అసలు జరిగిన విషయం ఏంటి ఇంతలా ఇండస్ట్రీపై రూమర్స్ రావడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
సంతోషం సురేష్ కొండేటి గోవాలో ఘనంగా సంతోషం అవార్డుల ఉత్సవాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేశాడు. ఈవెంట్ కు ఏకంగా గోవా సీఎంనే చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు . సౌత్ భాషల సినిమా అవార్డులతో పాటు ఓటీటీ అవార్డులు ఇవ్వాలని పూనుకున్నారు.నిజానికి సంతోషం అవార్డులు ఎప్పుడు హైదరాబాద్లోనే జరిగేవి కానీ ఈసారి డిఫరెంట్ గా గోవాలో ప్లాన్ చేశారు సురేష్. దీంతో భాగ్యనగరం నుంచి భారీగా సెలబ్రిటీస్ ఈవెంట్ కు తరలివచ్చారు. కానీ అవార్డుల ఫంక్షన్ మొత్తం అబాసుపాలై టాలీవుడ్ పరువు పోయినట్లయింది. అంతేకాదు ఈవెంట్ చూసేందుకు వెళ్లిన సినిమా జనాలకు కూడా అక్కడ చేదు అనుభవాలు ఎదురైనట్టు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది.
అవార్డుల వేడుకలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అవార్డులు ముగిసిన వెంటనే స్టేజ్ పైకి వెళ్లే మెట్ల తో పాటు లైట్లను ఆపేశారు. దీనితో ఒక్కసారిగా ఫంక్షన్ కు వచ్చిన వారంతా షాక్ అయ్యారు. పేమెంట్లు ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని రమర్స్ వస్తున్నాయి. హోటల్ నుంచి అవార్డుల వేడుక వేదిక దగ్గరికి వెళ్లే ఏర్పాట్లు కూడా సరిగా లేవని సమాచారం… ఆఖరికి గెస్టులను తీసుకువెళ్లే ట్యాక్సీ డ్రైవర్లు కూడా పేమెంట్లు ఇవ్వలేదని గొడవకు దిగారట. భారీరే రిటర్న్ ఫ్లైట్ టికెట్లు వేసుకొని కొంతమంది సెలబ్రిటీలు వెనక్కి వచ్చారని టాక్. అల్లు అరవింద్, దామోదర ప్రసాద్ లాంటివారు కొన్ని పేమెంట్లు చేశారని సమాచారం. సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. హోటల్ బిల్లులు కూడా చెక్ అవ్వలేదని అంటున్నారు. ఈ క్రమంలో యాంకర్ సుమ కూడా ఫంక్షన్ మధ్యలోనే వెళ్లిపోయినట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే సురేష్ కొండేటికీ మెగా ఫ్యామిలీ పర్సనల్ పీఆర్వోగా అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. సురేష్ మెగాస్టార్ చిరంజీవికి సొంత పిఆర్ఓ అని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు. దీంతో సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ గజిబిజిగా మారడంతో ఇదంతా మెగా ఫ్యామిలీ వీఆర్వో కారణంగానే జరిగిందంటూ మెగా ఫ్యామిలీని ఈ ఇష్యూ లోకి లాగుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ ఈ రూమర్స్ పై రియాక్ట్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ, అవార్డులు ఫంక్షన్ నిర్వహించడంలో సురేష్ ఫెయిల్యూర్ అయ్యాడని ఇది తన వ్యక్తిగత విషయమని ఇందులో మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని కొన్ని పేపర్స్ కావాలని మెగా ఫ్యామిలీ పిఆర్ఓ ఇలా చేశాడంటూ వార్తలు రాస్తున్నాయని ఆయన అన్నారు. సురేష్ మా పిఆర్ఓ కాదు.పైగా ఈ ఫంక్షన్ వల్ల ఇతర భాషల వారికి ఇబ్బందులు కలిగాయి.. వారు టాలీవుడ్ ని విమర్శిస్తున్నారు.. ఒక వ్యక్తి చేసిన పొరపాటును ఇండస్ట్రీకి ఆపాదించడం కరెక్ట్ కాదు అని అన్నారు. ఇప్పటి వరకు సురేష్ మెగా ఫ్యామిలీ పిఆర్ఓ అని చెప్పుకోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. అయితే ఇప్పటినుంచి ఆ పప్పులేమి ఉడకవు.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.