Pot Water: సాధారణంగా ఎండాకాలం ఈ వేడిని తట్టుకోలేక చాలామంది చల్ల నీటిని త్రాగటానికి ఇష్టపడుతుంటారు. అయితే చాలా మంది ఫ్రిడ్జ్ లో నిల్వ చేసినటువంటి నీటిని తాగుతూ ఉండగా మరికొందరు కుండలో నిల్వ చేసిన నీటిని తాగుతూ ఉంటారు. అయితే కుండలో నింపిన నీటిని తాగటం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదనే సంగతి మనకు తెలిసిందే.
ఇలా మట్టి కుండలో నీటిని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు వల్ల ఆ నీరు మనకు చాలా ప్రమాదకరంగా మారబోతున్నాయి. అందుకే మట్టి కుండలో నీరు త్రాగేవారు పొరపాటున కూడా ఇలాంటి తప్పులను చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనం మట్టి కుండలో నీటిని త్రాగుతూ ఉన్నట్లయితే చాలామంది కుండలో నీటిని ముంచుకొని తాగుతూ ఉంటారు. అలా చేయడం చాలా తప్పు.
కొన్నిసార్లు మనం చేతులు నీటుగా శుభ్రం చేసుకోకపోయి ఉండవచ్చు అలాంటప్పుడు మన చేతికి ఉన్నటువంటి బ్యాక్టీరియాలు అలాగే దుమ్ము ధూళి నీటిలో కలిసిపోయి నీరు కలుషితం అవుతాయి. అలాంటి నీటిని తాగటం వల్ల టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక వీలైనంత వరకు కుండకు కొళాయి ఉన్నటువంటి కుండను తీసుకోవడం మంచిది లేదంటే పొడువాటి గరిటెను ఉపయోగించడం ఎంతో మంచిది. అలాగే మనం కుండ చుట్టూ నీరు చల్లగా ఉండటానికి క్లాత్ కప్పి ఉంటారు. అలా కనుక కప్పి ఉంటే ప్రతిరోజు దానిని మార్చడం ఎంతో మంచిది లేదంటే దానిపై శిలింద్రాలు బ్యాక్టీరియాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుండలో నీటిని రోజు శుభ్రం చేస్తూ తాజా నీటిని నింపుకొని తాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.