Suma Kanakala : సుమ కనకాల ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. టీవీ ఉన్న ప్రతి ఒక్కరికి సుమా అంటే ఎవరు బాగా తెలుసు. గత కొన్నేళ్లుగా బుల్లితెరను ఏలుతున్న ఏకైక యాంకర్ సుమ. కేరళ కుట్టి అయినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ తన వాక్ చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులను అలరించడమే కాదు సినిమా ఫంక్షన్లోనూ తనదైన శైలి యాంకరింగ్ తో సినీ స్టార్స్ కు ఫేవరెట్ యాంకర్ గా మారిపోయింది.
ఇండస్ట్రీకి ఎంతమంది కొత్త యాంకర్లు వచ్చినా ఎంత మంది ఎక్స్పోజింగ్ తో అదరగొట్టినా తెలుగింటి కట్టుబొట్టుతో,స్వచ్ఛమైన తెలుగు మాటలతో బుల్లితెర వెండితెర అని లేకుండా రెండింటిని ఏలుతోంది. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్నాయి ఏ యాంకర్ కూడా ఇంతలాగా పాపులారిటీని సంపాదించుకోలేకపోయాది. సుమకు ఉన్న చరిష్మానే వేరు. ప్రస్తుతం సుమ తన కొడుకు రోషన్ ను ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది.
రోషన్ బబుల్ గమ్ సినిమాతో మొదటిసారి తెరంగేట్రం చేయబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ బిగ్ స్క్రీన్ లో విడుదల కాబోతోంది. దీంతో ప్రమోషన్ పనిలో మునిగిపోయింది మూవీ యూనిట్. ఈ క్రమంలోనే తన కొడుకు సినిమా ప్రమోషన్ లో సుమా పాల్గొంటుంది. రీసెంట్ గా ఓ టీవీ ఛానల్ నిర్వహించిన దీపావళి ఈవెంట్లో సుమా తన కొడుకు తో పాటు గెస్ట్ అపీయరెన్స్ ఇచ్చింది. ఈ క్రమంలో తన తోటి యాంకర్ శిల్పా సుమ గురించి కొన్ని షాకింగ్ విషయాలను చెప్పింది.
ఒకానొక సమయంలో షూటింగ్స్ కారణంగా మిడ్ నైట్ లేటుగా ఇంటికి వస్తే తలుపు తీసేవారు ఎవ్వరు లేకపోవడంతో కొన్నిసార్లు రాత్రిళ్లు మెట్ల పైనే సుమ పడుకునే దాన్ని శిల్ప చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న సుమ ఎమోషనల్ అయిపోవడంతో కొడుకు రోషన్ దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ అభిమానులు ఇంతటి స్థాయికి సుమ రావడానికి ఎంతో కష్టపడిందని కామెంట్స్ చేస్తున్నారు. సుమ టాలెంట్ ముందు ఎవరైనా దిగదుడిపే అంటూ ఆమెపై అభిమానాన్ని కురిపిస్తున్నారు. నిజమే మరి ఎంతమంది యాంకర్లు ఇండస్ట్రీకి వచ్చినా కొన్ని దశాబ్దాలుగా బుల్లితెరపై సందడి చేస్తోంది సుమ. టాలెంట్ ఉన్నవారు ఇండస్ట్రీలో కచ్చితంగా నిలబడతారు అని అనడానికి సుమ ఓ ఉదాహరణ.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.