Suhana Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ గారాల కూతురు సుహానా ఖాన్ అలీబాగ్‌లో రూ. 12.91 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ మీడియా చానెల్స్ ఈ విషయాన్నీ నివేదించాయి. నివేదిక ప్రకారం, సుహానా ఖాన్ రాయ్‌గఢ్ జిల్లాలోని అలీబాగ్‌లో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ భూమిని రూ. 12.91 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం.
IndexTap.com లోని విక్రయ పత్రం యొక్క ఒప్పందం ప్రకారం, మూడు వరుస గృహాలు కలిగిన ఈ ల్యాండ్ 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో కొబ్బరి చెట్లు, ఇతర తోటలు, బావి, మరియు నీటి ట్యాంకులు ఉన్నట్లు సమాచారం. కఫ్ తన ముగ్గురు సోదరీమణులు అంజలి ఖోటే, ప్రియా ఖోటే, రేఖా ఖోటే నుండి స్టాంప్ డ్యూటీ కింద రూ. 77.46 లక్షలు చెల్లించి, ఈ నెల ప్రారంభంలో తన పేరుమీద రిజిస్టర్ చేసుకుంది. విలాసవంతమైన ఆస్తి కోసం ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తారా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు.
సుహానా ఖాన్ చేసిన ఈ కొనుగోలుతో, అలీబాగ్‌లో ఖాన్ కుటుంబానికి ఉన్న ఆస్తికి అదనంగా చేరింది . ఇప్పటికే, షారుఖ్ ఖాన్ సమీపంలో విలాసవంతమైన డెజా వు ఫామ్స్ ఉన్నాయి. ఖాన్ కుటుంబ సభ్యులకే కాదు బాలీవుడ్ లోని చాలామంది సెలబ్రిటీలకు అలీబాగ్ సమీపంలో విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, దీపికా పదుకొనే-రణవీర్ సింగ్, రాహుల్ ఖన్నా, అనితా ష్రాఫ్ అదాజానియా – హోమీ అదాజానియా, గౌతమ్ సింఘానియా, రామ్ కపూర్ లకు ఎన్నో కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, ఇంటీరియర్ డెకరేటర్ గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ న్యూయార్క్‌లో ఉన్నత చదువులు పూర్తి చేసింది. అంతకు ముందు ఆమె ఆర్డింగ్లీ కాలేజీలో సినిమా కోర్స్ ను అభ్యసించింది. గతంలో థియేటర్ షోలు కూడా చేసిన సుహానా ఖాన్, థియోడర్ గిమెనో దర్శకత్వం వహించిన ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ అనే షార్ట్ ఫిల్మ్‌లో కనిపించింది. జోయా అక్తర్ యొక్క ది ఆర్చీస్ తో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రంలో దివంగత నటి శ్రీదేవి, చిత్ర నిర్మాత బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద కూడా నటించాడు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.