SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ఇది తెరకెక్కనుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న జక్కన్న ఇప్పుడు సూపర్ స్టార్ మూవీతో మరోసారి ఇంటర్నేషనల్ లెవల్ లో మీడియాని ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ నటులని కూడా తీసుకోవడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ గురించి ప్రస్తుతం ఇంటరెస్టింగ్ అప్డేట్స్ తెరపైకి వచ్చాయి. మూవీలో లార్డ్ హనుమాన్ ఇనిస్పిరేషన్ తో ఈ మూవీలో మహేష్ బాబు పాత్రని హైపర్ యాక్టివ్ గా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.
హనుమంతుడు తరహాలో మహేష్ బాబు సాహసాలు సినిమాకి ప్రధాన హైలైట్ గా ఉంటాయంట. అలాగే వరల్డ్ అడ్వంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు సినిమాలో కనిపిస్తాడు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుంది. చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అపీరియన్స్ డిఫరెంట్ గా ఉండబోతుందంట. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకి భిన్నమైన అవతారంలో మూవీలో కనిపిస్తాడంట. హాలీవుడ్ హీరోయిన్ జెన్నా ఒర్టేగాని మహేష్ బాబుకి జోడీగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి జెన్నాతో సంప్రదింపులు జరిపారని ప్రచారం నడుస్తోంది.
ఈ సినిమాకి హాలీవుడ్ లో వచ్చిన ఇండియానా జోన్స్ సిరీస్ స్ఫూర్తిగా తీసుకొని సిద్ధం చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది. జక్కన్న ఇండియానా జోన్స్ ని తన స్టైల్ లో అడాప్ట్ చేసుకొని ఆవిష్కరించబోతున్నారంట. ఈ సినిమా కోసం ఏకంగా 500 కోట్ల బడ్జెట్ రాజమౌళి ఖర్చు చేయబోతున్నారని టాక్ ఇప్పటికే దానికి సంబందించిన బడ్జెట్ ప్లాన్ నిర్మాత కెఎల్ నారాయణకి జక్కన్న ఇవ్వడం జరిగిందని సమాచారం. చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తుననరని తెలుస్తోంది. దానికి తగ్గట్లుగానే విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాక్. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకునే ఈ మూవీలో ఒక హీరోయిన్ గా కనిపించబోతుంది అనే మాట వినిపిస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.