Categories: DevotionalLatestNews

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు
*ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక

Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత వారం రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలమైన శ్రీమాలిక వంటి నాలుగు వందల పేజీల మహోజ్వల మంత్ర స్తోత్ర కథా వైభవాల అఖండ గ్రంధాన్ని వందల కొలది ప్రతులను ఉభయ దాతలకు, భక్తులకు, రాజకీయ సాంస్కృతిక రంగాల ప్రముఖులకు పంచేందుకు దేవస్థానానికి సమర్పించిన మాజీమంత్రి, కిమ్స్ హాస్పటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యకు ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం ఉంటుందని దేవస్థానం డిప్యూటీ కమీషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థాన కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆయన శ్రీమాలిక పవిత్ర గ్రంధాన్ని ఆవిష్కరించి ఆలయ అర్చకులకు, వేదపండితులకు అందజేశారు.

Kadiri Narasimha Swamy:నందమూరి బాలకృష్ణ ప్రోత్సాహంతో

Sreemaalika Book by Puranapanda Srinivas Presented at Kadiri Narasimha Swamy Temple

 

ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మాహావతారమైన నృసింహావిర్భావఘట్టం అద్భుతమైన కథతో పాటు వేంకటాచలక్షేత్రమైన తిరుమల వైభవ వైభోగ విశేష కధనాలు, ఋషుల వరప్రసాదంగా అందిన స్తోత్రాలకు రమణీయ కమనీయ వ్యాఖ్యానాలు పురాణపండ శ్రీనివాస్ ఎంతో పవిత్రంగా, అందంగా అందించి భక్త జనహృదయాలను కొల్లగొట్టారని అభినందించారు.

ఈ దివ్య గ్రంథ శ్రీకార్యాన్ని బలపరిచి ప్రోత్సహించిన హిందూపూర్ శాసన సభ్యులు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటిలకు వెండిదండి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Sreemaalika Book by Puranapanda Srinivas Presented at Kadiri Narasimha Swamy Temple

గతంలో నందమూరి బాలకృష్ణ ప్రోత్సాహంతో వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి సమర్పించిన ‘శరణు … శరణు’ మహోజ్వలమైన లక్ష్మీ నరసింహ స్వామి వందల కొలది భారీ గ్రంధాలను తిరుమల, కదిరి, సింహాచలం క్షేత్రాలకు భక్త జనులకు, పాఠకులకు, పండిత వర్గాలకు అందజేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

Sreemaalika Book by Puranapanda Srinivas Presented at Kadiri Narasimha Swamy Temple

ఇప్పటికే ఇంద్రకీలాద్రి, వేంకటాద్రి, యాదాద్రి, శ్రీశైలం, అన్నవరం వంటి అనేక క్షేత్రాలలో గత రెండు దశాబ్దాలుగా పురాణపండ శ్రీనివాస్ రచనలు, సంకలనాలు అనేక ధార్మిక పారమార్ధిక గ్రంధాల రూపంలో లక్షలాది భక్తులను అలరిస్తున్నాయనేది స్పష్టమైన సత్యం.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Anil Ravipudi: కీర్తి సురేష్, కృతి శెట్టి..ఇది మీకు గోల్డెన్ ఛాన్స్!

Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…

24 hours ago

Balakrishna: నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’..

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…

1 day ago

Mahesh Babu: వారణాసి అప్‌డేట్స్‌తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…

2 days ago

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

5 days ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

4 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

4 weeks ago

This website uses cookies.