Sreeleela : శ్రీలీలకు ఇండస్ట్రీలో బాగా కలిసివచ్చింది. కన్నడలో సినీ రంగ ప్రవేశం చేసినా ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌ను ఏలేస్తోంది. కొద్ది కాలంలోనే స్టార్డమ్ సంపాదించి స్టార్ హీరోల సరసన చిందులేస్తోంది. శ్రీకాంత్ కొడుకు రోషన్ కు జోడీగాపెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.
ఈ సినిమాలో రోషన్ కు కలిసివచ్చిందో లేదో కానీ, శ్రీలీల దశ మాత్రం ఓ రేంజ్ లో తిరిగిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో ఈ పాపకు పూల బాట వేశారు ఫిల్మ్ మేకర్స్. రవితేజతో శ్రీలీల చేసిన ధమాకా సినిమా ఈమె క్రేజ్ ను అమాంత పెంచేసింది. సినిమా వంద కోట్లు కొల్లగొట్టడంతో అమ్మడిని గోల్డెన్ లెగ్ గా భావిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో శ్రీలీల డ్యాన్స్, గ్రేస్, అందం అందరినీ ఫిదా చేసేసింది. టాలీవుడ్‌లో తరచుగా ఈ బ్యూటీ గురించే టాక్ వినిపిస్తోంది.
శ్రీలీలకు ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆమె డ్యాన్సులకు తెలుగు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. దీంతో ఆఫర్స్ అమ్మడి ఇంటి గుమ్మం ముందు క్యూలు కడుతున్నాయి. బడా బడా హీరోలు కూడా శ్రీలీల హీరోయిన్ గా కావాలంటూ కోరుకుంటున్నారట. అందుకే ఈ బ్యూటీ నటించిన సినిమా నెలకు ఒకటి చొప్పున విడుదల కాబోతున్నాయి. బాలయ్యతో నటించిన భగవంత్ కేసరి, వైష్ణవ్ తేజ్‌తో కలిసి చేసిన ఆదికేశవ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నితిన్‌తోనూ ఓ మూవీ త్వరలో పట్టాలెక్కనుంది. ఆ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఆల్రెడీ మేకర్స్ ఫస్ట్ సింగిల్‌తో ఓ రేంజ్ హైప్ పెంచేశారు.
టాలీవుడు అగ్రకథానాయకులైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల సినిమాల్లోనూ శ్రీలీల నటించబోతోంది. శ్రీలీలను తమ మూవీల్లో తీసుకోవాలని హీరోలు, దర్శక నిర్మాతలు కోరుతున్నారట. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్‌లోనూ శ్రీలీలను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. రవితేజ సైతం మళ్లీ ధమాకా కాంబోను రిపీట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే విజయ్ మూవీ ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. అయితే శ్రీలీల మాత్రం జాయిన్ అయినట్టుగా ఎక్కడా కనిపించడం లేదు. చేతినిండా సినిమాలతో శ్రీలీలకు డేట్ల సమస్యలు వస్తున్నాయట. శ్రీలీల డేట్లు అడ్జస్ట్ చేయలేకపోతోందని టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాపం ఊపిరిసలపని షూటింగ్లతో బిజీ ఉన్న శ్రీలీల విజయ్, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక రవితేజ అడిగినా కూడా శ్రీలీల డేట్లు అడ్జస్ట్ చేయలేని చెప్పేసిందట.
ఇదిలా ఉంటే శ్రీలీల తన ఎంబీబీఎస్ చదువు కోసం డిసెంబర్ మొత్తం సినిమాలకు దూరంగా ఉండబోతోంది. అందుకే ఈ భామకు డేట్ల సమస్య వస్తోంది. చేసేదేమీ లేక ఈ భామ చివరినిమిషంలో ఈ రెండు చిత్రాలకు నో చెప్పేసింది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అన్నది మాత్రం నిర్మాణ సంస్థలకే తెలియాలి. ఈ రూమర్ల మీద వారేమైనా రిప్లై ఇస్తారో ఎదురుచూడాల్సిందే.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.