Sreeleela : కుర్రభామ శ్రీలీల మాంచి దూకుడు మీద ఉంది. ఎడాపెడా వరుసబెట్టి సినిమాలకి సైన్ చేస్తోంది. పెళ్లి సందడి సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ ధమాకా సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. దీంతో ఇప్పుడు శ్రీలీల కమర్షియల్ హీరోయిన్‌గా మారిపోయింది. పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్న భారీ చిత్రాల్లో చకచకా అవకాశాలను అందుకుంటోంది. నిజంగా శ్రీలీలకి ఈ ప్రాజెక్ట్స్‌లో ఛాన్స్ దక్కుతుందని ఎవరూ ఊహించరు.
ధమాకా లాంటి మాసివ్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సందడి చేయబోతోంది. దీంతో పాటు బాలయ్య సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తుంది. అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో మరో హీరోయిన్ కూడా నటిస్తోంది.
వీటితో పాటు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మరో సినిమాలో హీరోయిన్‌గా సైన్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలై శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇలా భారీ చిత్రాలే కాకుండా యంగ్ హీరోల సరసన కూడా హీరోయిన్‌గా అలరించబోతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా..శ్రీలీల కొన్ని సినిమాలను అనవసరంగా ఒప్పుకొని తనకు వచ్చిన స్టార్ డం మొత్తాన్ని పోగొట్టుకుంటుందా..? అని మాట్లాడుకుంటున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే సినిమాలలో సెకండ్ హీరోయిన్‌ను ఎవరూ పట్టించుకోరు. కాబట్టి ఆ సినిమా అనవసరంగా కమిటైందని మాట్లాడుకుంటున్నారు. అలాగే బాలయ్య సినిమా కూడా. మంచి ఏజ్ ఉంది..టాలెంట్ ఉంది. సక్సెస్‌లు వస్తున్నాయి. ఇలాంటి సయమలోనే ఆలోచించి కేవలం యంగ్ హీరోల సినిమాలను ఒప్పుకుంటే లాంగ్ టైం కెరీర్ ఉంటుంది. కానీ, శ్రీలీల అలా చేయడం లేదు. దూకుడుగా సినిమాలను కమిటవుతోంది. అదే అమ్మడి కెరీర్‌ని ఇబ్బందుల్లో పడేస్తుందేమో అని సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి సిని వర్గాలు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.