Sreeleela: బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల రష్మికకి పెట్టింది చెక్..? అవును ఇప్పుడు ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో ఇదే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల హవా నడుస్తోంది. శ్రీలీల కి ఇప్పుడున్న క్రేజ్ అండ్ డిమాండ్ ఇంకో హీరోయిన్ కి లేదంటే ఒప్పుకొని తీరాల్సిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్నని కూడా వెనక్కి నెట్టేసింది శ్రీలీల.
తెలుగులో ఆమెకి దక్కాల్సిన చాలా అవకాశాలు చెక్ పెట్టి శ్రీలీల అందుకుంటుందని ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఓ ఛాన్స్ అందుకుంది రష్మిక మందన్న. గీతా ఆర్ట్స్ లో ఇంతకముందు గీత గోవిందం సినిమా చేసి హిట్ అందుకుంది. మళ్ళీ ఇంతకాలానికి అదే సంస్థలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తుంది. నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ మూవీకి దర్శకుడు. ది గర్ల్ ఫ్రెండ్ అనే టైటిల్ తో రూపొందుతోంది.
అయితే, ఇక్కడున్న కాంపిటీషన్ తో రష్మిక కి ఆశించినంతగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ మీద దృష్ఠిపెట్టింది. ఇప్పటి వరకూ చేసిన సినిమాలు అక్కడ సక్సెస్ కాకపోయినా సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇటీవలే ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజై వైరల్ అయింది. ఏదో బాలీవుడ్ లో నానా తంటాలు పడి నిలదొక్కుకోవాలని చూస్తున్న రష్మిక మందన్న ఆశల మీద నీళ్ళు చల్లటానికి శ్రీలీల తయారైందని తాజా సమాచారం.
బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కొత్త ప్రాజెక్ట్ కోసం శ్రీలీలను సంప్రదించినట్టుగా న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం బాద్‌షా వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నారు. కొత్త ప్రాజెక్ట్స్ ని నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త ప్రాజెక్ట్ కోసం శ్రీలీలకి ఆఫర్ చేశారట. ప్రస్తుతం షారుఖ్ ఫోకస్ అంతా సౌత్ హీరోయిన్స్ మీదే ఉంది. ఇటీవలే వచ్చిన జవాన్ సినిమాలోనూ నయనతారకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు శ్రీలీలని బాలీవుడ్ కి లాగాలని చూస్తున్నారట. ఇదే జరిగితే అక్కడ రష్మిక పని మఠాష్. కానీ, శ్రీలీల మాత్రం ఇప్పట్లో బాలీవుడ్‌లో అడుగుపెట్టే ఆలోచన చేయడం లేదట. ఇక్కడే మరిన్ని సక్సెస్‌లు అందుకోవాలని పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయని చెబుతుందట.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.