SreeLeela: టాలీవుడ్ లో క్రేజీగా మారిన శ్రీలీల

SreeLeela: టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకునే దిశగా అందాల భామ శ్రీలీల దూసుకుపోతుంది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడుకి మొదటి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. అయినా కూడా ఊహించని స్థాయిలో వరుస అవకాశాలని ఈ అమ్మడు అందుకుంది. ఇక రెండో సినిమాని రవితేజతో ధమాకా చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో శ్రీలీల సెన్సేషన్ గా మారింది.

sreeleela-crezy-in-tollywood

ఇక ధమాకా మూవీ రిలీజ్ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో అమ్మడు నటించింది. ఇక ఈ మూవీ సెట్స్ పైన ఉండగానే ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించే ఛాన్స్ ని కొట్టేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఖరారు అయ్యింది.

నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కూడా ఆమెని హీరోయిన్ గా ఖరారు చేశారు. వీటితో పాటు రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోని, నితిన్, వక్కంతం వంశీ మూవీలో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. ఓవరాల్ గా తెలుగులోనే ఆమె చేతిలో ఏకంగా 10 సినిమాల వరకు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలలో చాలా వరకు పాన్ ఇండియా రేంజ్ మూవీస్ కావడం విశేషం. ఈ సినిమాలు హిట్ అయితే మాత్రం శ్రీలీల రేంజ్ కచ్చితంగా మారిపోతుంది అని చెప్పాలి.  మొత్తానికి టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఒక్క సినిమా రిలీజ్ తోనే ఏకంగా పది సినిమాలకి కమిట్ అయిన హీరోయిన్ గా శ్రీలీల అరుదైన గుర్తింపుని సొంతం చేసుకుంది అని చెప్పాలి.

Varalakshmi

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

2 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

2 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.