Sreeleela: శ్రీలీల కెరీర్ క్లోజ్ అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో తానే చిన్న బ్రేక్ తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చింది. కన్నడ, తెలుగు సినిమాలతో గత ఏడాది వరకూ చాలా బిజీగా గడిపింది. కానీ, సక్సెస్‌లు మాత్రం ఆశించినంతగా దక్కలేదు. తెలుగులో మొదటి సినిమా “పెళ్లి సందD”. రాఘవేద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన సినిమా కాబట్టి ఉన్నంతలో అందాల ఆరబోత బాగానే చేసింది.
దాంతో అవకాశాలు వరుసగా వచ్చి పడ్డాయి. అదే శ్రీలీలకి పెద్ద మైనస్ అయింది. మరీ ముఖ్యంగా రవితేజ లాంటి సీనియర్ హీరోతో సినిమా చేయడం. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ధమాకా’ హిట్టైనా కూడా శ్రీలీల కెరీర్ కి అంతగా ఉపయోగపడలేదు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ వరుసబెట్టి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్స్ గా మిగిలాయి.
దానికితోడు శ్రీలీల పర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకోలేకపోయింది. డాన్స్ విషయంలో మంచి మార్కులు పడ్డాయి. అదే ఇంకో మైనస్ గా మారింది. శ్రీలీల చేసిన సాంగ్స్ బావున్నప్పటికీ అవి తనకి ఐటెం గాళ్ అనే టాక్ ని తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకూ ఈ బ్యూటీ చేసిన సినిమాలలో కాస్త గుర్తుండేదంటే ఆ ‘ధమాకా’, బాలయ్యతో చేసిన ‘భగవంత్ కేసరి’ మాత్రమే.
‘గుంటూరు కారం’ సినిమా ఎందుకు ఒప్పుకుందో తెలీదని చాలామంది కామెంట్స్ చేశారు. ఈ సినిమా తర్వాత చదువుకోసం సమయం కేటాయించింది. ‘పుష్ప 2’ సినిమాలో ఉన్న ఐటెం సాంగ్ లో చివరికి వచ్చి చేరింది. పార్ట్ 1 లో సమంత చేసిన సాంగ్ ఇంపాక్ట్ వల్ల ‘గుంటూరు కారం’ సినిమాలో ఉన్న కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎఫెక్ట్ వల్ల పుష్ప 2 లో ఉన్న ఐటెం సాంగ్ కిసిక్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. కానీ, ఆ హోప్స్ అన్నీ సాంగ్స్ రిలీజైయ్యాక పుసుక్కుమన్నాయి.
సినిమా రిలీజైయ్యాక స్క్రీన్ ప్రజెన్స్ బావుంటే శ్రీలీల మీద రేగిన నెగిటివ్ టాక్ చెరిగిపోతుంది. ఇప్పటికే, హీరోయిన్ గా కంటే ఐటెం గాళ్ గా సినిమాలలో సాంగ్స్ చేయడం బెటర్ అన్న కామెంట్సే కంటిన్యూ అవుతాయి. దీనికి కారణం సమత అప్పటి వరకూ ఐటెం సాంగ్స్ చేయలేదు కాబట్టి ఆ అపీరియన్స్ కనిపించలేదు గనేఅ ప్రెష్ గా ఫీలయ్యారు. ఎంజాయ్ చేశారు. కానీ, శ్రీలీల సాంగ్స్ అన్నీ ఐటెం సాంగ్స్ గానే ఉంటున్నాయి. వాటిలో ఇదొకటీ అవుతుంది తప్ప ఇదే స్పెషల్ గా మాత్రం చూడలేకపోతున్నారు.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.