Sreeleela: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ హీరోయిన్ శ్రీలీలకి బంధువు. ఈ విషయం స్వయంగా అనిల్ రావిపూడి ఈ మధ్య భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్‌లో చెప్పాడు. అలా శ్రీలీలకి ఆయన బాగా దగ్గర బంధువు అయినప్పటికీ ఇండస్ట్రీలో శ్రీలీలకి కమిట్‌మెంట్ అడిగిన వాళ్ళూ ఉన్నారని ఓ తాజా వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో “పెళ్లి సందడి” సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారానే శ్రీలీల తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ మాస్ మహారాజ రవితేజ సరసన ధమాకా చిత్రంలో అవకాశం అందుకుంది. ఈ సినిమా మాసీవ్ హిట్ అందుకోవడంతో వరుస ఆఫర్లు శ్రీలీలకి వస్తున్నాయి.
ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల కీలకమైన పాత్రను పోషించి అందరి ప్రశంసలు దక్కించుకుంది. దీంతో మరో సూపర్ హిట్ ని శ్రీలీల తన ఖాతాలో వేసుకుంది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో “స్కంద” మూవీ చేసింది. ఈ క్రమంలో శ్రీలీల వైష్ణవ్ తేజ్ కి జంటగా నటించిన “ఆదికేశవ”, నితిన్ సరసన నటించిన “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
అలాగే, సూపర్ స్టార్ మహేష్ బాబుతో “గుంటూరు కారం”, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రాలు శ్రీలీల చేతిలో ఉన్నాయి. అయితే, తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రాం లో ఫ్యాన్స్ కి హాయ్ చెప్పింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్..’ఆర్ యూ కమిటెడ్.. అని క్వశ్చన్ చేశాడు. దీనికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా ‘ఎస్ నేను నా పని విషయంలో కమిటెడ్‌గానే ఉంటాను’..అని కూల్‌గా సమాధానమిచ్చింది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంటి మేనమామ ఉన్నా నెటిజన్స్ శ్రీలీలను ఇలా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగటం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.