Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన తర్వాత తిరిగి వస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు అత్యుత్సాహం చూపించారు. నడుచుకుంటుంటూ వస్తున్న సమయంలో గుంపులో వస్తున్న ఓ వ్యక్తి శ్రీలీల చేయి పట్టుకుని బలవంతంగా లాగాడు. దీంతో, ఆమె వారి వైపు పడబోయారు. సోషల్ మీడియాలో దీనికి సంబందించిన విజువల్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.
తెలుగులో శ్రీలీల నితిన్ సరసన నటించిన ‘రాబిన్‌హుడ్’ మూవీ ఇటీవల విడుదలైంది. కానీ, ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ మధ్య శ్రీలీలకి వరుస ఫ్లాప్స్ వస్తున్నా కూడా అవకాశాలకి కొదవలేదు. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు కమిటైయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ సరసన ఒక సినిమాను చేస్తున్నారు. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రేమ కథా చిత్రం ఆషికీ సీక్వెల్ అని తెలుస్తోంది.
కాగా, ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా చిత్రయూనిట్ ఇటీవల డార్జిలింగ్‌కు వెళ్లింది. షూటింగ్ పూర్తయ్యాక శ్రీలీల.. కార్తిక్ ఆర్యన్‌తో కలిసి తిరిగి వస్తుండగా.. ఈ జంటను చూసేందుకు స్థానికులు, అభిమానులు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే ఒకడు శ్రీలీల చేయి పట్టుకుని లాగాడు. చుట్టూ బాడీగార్డులు ఉన్నా కూడా గుంపులో నుంచి కొంతమంది పోకిరీలు ఆమె చేయి పట్టుకుని బలవంతంగా లాగారు. దీంతో శ్రీలీల ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే వారి వెంట ఉన్న బాడిగార్డ్స్ అప్రమత్తమవడంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.