Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ క్రేజీ మూవీని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారో వెల్లడించారు మేకర్స్. న్యూఇయర్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ ప్రతీ ఒక్కరికీ మెంటలెక్కిపోయే అప్‌డేట్ ఇచ్చి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అథిదిగా వచ్చి స్పిరిట్ మూవీ ఓపెనింగ్ జరిపారు.
ఆ తర్వాత సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్‌ని డిసెంబర్ నెలలోనే కంప్లీట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. జనవరి 9న ది రాజాసాబ్ సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం డార్లింగ్ ప్రభాస్ స్ప్రిట్ సినిమాకి చిన్న బ్రేక్ ఇచ్చాడు. మళ్ళీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయిందని సమాచారం. ఇక, 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్‌టైన్ చేయడానికి ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ తమ సినిమాలతో వచ్చారు.
ఇక, కొత్త సినిమాలకి సంబందించిన అప్‌డేట్స్ కూడా వచ్చాయి. వాటిలో కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో రూపొందబోతున్న ‘ఎల్లమ్మ’ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చి అందరినీ ఎంతో ఎగ్జైట్ చేసింది. ఈ సినిమాలో హీరోగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ‘పర్షి’ పాత్రలో అలరించబోతున్నాడు. రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. అలాగే, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాకి ‘స్లమ్ డాగ్’ అనే టైటిల్‌తో పాటు విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ని వదిలారు.
ఇలా, వరుసగా కొత్త సినిమాల అప్‌డేట్స్ వచ్చి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపాయి. ఇదే క్రమంలో సందీప్ రెడ్డి వంగ కూడా మన డార్లింగ్ ప్రభాస్‌తో చేస్తున్న కాప్ స్టోరీ ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశాడు. 2027, మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం మార్చ్ 5 అంటే స్టూడెంట్స్ అందరూ ఎగ్జాంస్ తో చాలా బిజీగా ఉంటారు. మరి, ఈ విషయాన్ని మర్చిపోయాడా సందీప్ రెడ్డి అనేది తెలియదు గానీ, మార్చ్ ని టార్గెట్ చేస్తూ ప్రకటించడం మాత్రం ఆసక్తికరం. కాగా, స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి నటిస్తోంది. వీరి ఫస్ట్ లుక్‌తో ఇంటర్నెట్ షేక్ అయిన సంగతి తెలిసిందే.
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
Puri-Slum Dog: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని ఫిక్స్…
This website uses cookies.