South Heroines : టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా చిత్ర పరిశ్రమలో హీరోల లైఫ్ టైంతో పోల్చుకుంటే హీరోయిన్లది చాలా తక్కువ అనే చెప్పాలి. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన 10 సంవత్సరాలు అంతా బాగానే ఉన్నా కొంతకాలం తర్వాత కొత్త నీరు అదే కొత్త హీరోయిన్లు వస్తే వీరు ఫేడౌట్ అయిపోతుంటారు. వారి ఇమేజ్ కూడా తగ్గిపోతుంది. చాలా అరుదుగా మాత్రమే కొంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తమ హవాను కొనసాగిస్తుంటారు. హీరోయిన్ గా వర్కౌట్ కాదనుకున్నవారంతా ఇక ఆ తర్వాత అక్క , చెల్లి, వదిన వంటి పాత్రలు చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రంగుల లోకంలో ముందుకు వెళ్తుంటారు. ఇక కొంతమంది హీరోయిన్లు అటు తండ్రితో ఇటు కొడుకుతోనూ జోడీ కట్టిన సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయని చెప్పాలి. కొంతమంది హీరోయిన్లు ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా చలామణి అవుతూ తమ హవాను కొనసాగిస్తున్నారు. మరి తండ్రి కొడుకులతో కలిసి నటించిన హీరోయిన్లు ఎవవరో ఇప్పుడు చూసేద్దాం.
అక్కినేని నాగేశ్వరరావు-నాగార్జున-శ్రీదేవి : అతిలోక సుందరి దివంగత అందాల నటి శ్రీదేవి భారతీయ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. తన అందం ,నటనతో ఆమె ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ గూడుకట్టుకుంది. అప్పట్లో శ్రీదేవి సీనియర్ హీరోలతోనే కాదు కుర్ర నటులతోనూ జోడీ కట్టి వెండితెరపైన ఓ మెరుపు మెరిసింది. ఎన్నో వందల చిత్రాల్లో నటించి ఈ అందాల తార అందరిని ఆకట్టుకుంది. అప్పటి టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావుతోనూ శ్రీదేవి ఎన్నో సినిమాలలో కలిసి నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు ఎనర్జిటిక్ స్టార్ మన్మథుడు నాగార్జునతోనూ పలు సినిమాల్లో కలిసి నటించింది. నాగ్, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన గోవిందా గోవిందా, ఆఖరిపోరాటం వంటి చిత్రాలు ఆల్ టైం హిట్ చిత్రాలుగా నిలిచాయి.
వెంకటేష్-రానా-నయనతార-అనుష్క :
లేడీ సూపర్ స్టార్ నయనతార గత 17 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. తాజాగా షారుఖ్ నటించిన జవాన్ చిత్రంతో నయనతార బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. తన కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి నయన్ ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. టాలీవుడ్ లో విక్టరీ వెంకటేశ్ తో కలిసి “లక్ష్మీ ,తులసి” వంటి సినిమాల్లో నయనతార నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. బాబాయ్ తోనే కాదు వాళ్ల అబ్బాయి రానాతో కలిసి “కృష్ణం వందే జగద్గురుం” సినిమాలో యాక్ట్ చేసింది ఈ బ్యూటీ. మరో బ్యూటీ టాలీవుడ్ స్వీటి అనుష్క కూడా వెంకీ బాబాయ్ రానా అబ్బాయితో కలిసి పలు సినిమాల్లో నటించింది. వెంకటేష్‌తో చింతకాయల రవి సినిమాలో యాక్ట్ చేసిన అనుష్క ..రానాతో రుద్రమదేవి మూవీలో కలిసి యాక్ట్ చేసింది.
బాలకృష్ణ-ఎన్టీఆర్-శ్రీయ-త్రిష :
ఇక టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ స్టార్ బాలయ్య బాబుతో వాళ్ల అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి శ్రీయ పలు సినిమల్లో నటించింది. బాలకృష్ణతో శ్రీయ చెన్నకేశవరెడ్డి సినిమాలో కనిపించింది. ఆతర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో నా అల్లుడు మూవీ చేసింది. ఇక కోలీవుడ్ బ్యూటీ త్రిష కూడా వీరిద్దరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. బాలకృష్ణతో లయన్ సినిమాలో మెరిసిన త్రిష, అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము సినిమాలో కలిసి పనిచేసింది.
కాజల్-చిరంజీవి-రామ్ చరణ్ :
నార్త్ భామ అందాల చందమామ కాజల్ తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆమె యాక్టింగ్ , అందంతో చాలా సినిమాల్లో నటించి అందరిని మెస్మరైజ్ చేసింది. ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 మూవీలో హీరోయిన్ గా నటించింది. అనంతరం మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో నాయక్, గోవిందుడు అందరివాడేలే వంటి హిట్ సినిమాల్లో కలిసి పని చేసింది. ఇక బాబాయ్ అబ్బాయిల కాంబినేషన్ లో యువ కథనాయకి శృతి హాసని కలిసి పని చేసింది. శృతిహాసన్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేయగా, ఆ తర్వాత రామ్ చరణ్ తో ఎవడు సినిమాలో కలిసి నటించింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.