Sonakshi Sinha : బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. తన వైవిధ్యమైన నటనతో అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ బ్యూటీ. దక్షణాన సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లింగ సినిమాలోనూ తన న్యాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులకు దగ్గరైంది సోనాక్షి సిన్హా. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ కు వెళ్లకుండా తన క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఆచితూచి ఎంచుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు . రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి డైరెక్షన్ లో వచ్చిన ‘హీరమండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ లో నటించి తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. లాహోర్ లోని ఓ రెడ్ లైట్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇది స్వతంత్రం కంటే ముందు జరిగిన కథ. ఈ వెబ్ సిరీస్ లో సోనాక్షి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
“ఇండస్ట్రీలో నేను ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ చూశారు. దీంతో క్యారెక్టర్ల సెలక్షన్ ను పూర్తిగా మార్చుకున్నాను. అలా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. కొన్ని డిజాస్టర్ అయ్యాయి. జయాపజయాలను పక్కన పెడితే నటిగా ఆ సినిమాలను నేను ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోవచ్చు. అయితే టీమ్‌లోని కొందరితో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. సినిమా హిట్ అవ్వడం ,కాకపోవడం నా చేతుల్లో లేదు. అది నాకు కూడా తెలుసు. అయినా ఓ నటిగా నా వంతు ప్రయత్నం చేస్తాను. నేను నటించిన చాలా వరకు సినిమాల్లో నా నటనకు ఎప్పుడూ ప్రశంసలు వచ్చేవి. నా కెరీర్ డెవలప్మెంట్ కోసం నేను ప్రతి సినిమాను ఇష్టపడుతూనే చేశాను.
నిర్మాతలు హీరోయిన్లకు ఫోన్ చేసి అన్నీ చర్చిస్తారు. నటీమణులందరికీ అవకాశం ఇవ్వాలని భావిస్తారు. అయితే డబ్బు విషయంలో మాత్రం బేరాలాడుతారు. రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కూరగాయలను బేరమాడినట్లు హీరోయిన్లతో బేరమాడతారు.”అలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఎప్పటి నుంచో హీరోయిన్ల విషయంలో ఇలాగే జరుగుతోంది. స్త్రీలుగా మనం పోరాడవలసిన యుద్ధం ఇది. ఇప్పటికే మనం ఎన్నో యుద్ధాలు చేస్తున్నాము. కాబట్టి, రెమ్యునరేషన్ కోసం కూడా పోరాటం చేయాలి”అని చెప్పుకొచ్చింది సోనాక్షి.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాతో సోనాక్షి సిన్హా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమానే భారీ హిట్ కావడంతో సోనాక్షికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇక ఈ బ్యూటీ రేంజ్ మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సోనాక్షి అనుకున్నంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. ‘అకీరా’, ‘నూర్’, ‘హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించి మెప్పించింది. అయితే ఈ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేకపోయాయి.కానీ ఇప్పుడు హీరామండితో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది సోనాక్షి. దీంతో మళ్లీ క్రేజీ ఆఫర్లు క్యూ కడతాయని అభిమానులు ఆశపడుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.