Sleeping: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన సమయానికి తినడం మాత్రమే కాదు సరైన సమయానికి నిద్రపోవడం కూడా మన ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇలా ఎప్పుడైతే మన శరీరానికి కావలసినంత నిద్రపోతామో అప్పుడే ఎంతో ఆరోగ్యంగా ఉండగలము. ఇలా శరీరానికి అవసరమైనంత నిద్ర ఎంతో అవసరం. రోజుకు రాత్రి 8 గంటల సమయం నిద్రపోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండగలమని నిపుణులు చెబుతుంటారు. ఇకపోతే చాలామంది రాత్రి సమయంలో నిద్ర పోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.
పడుకున్న కొన్ని గంటలైనా కూడా నిద్ర రాక ఇబ్బంది పడుతుంటారు అలాగే ఎండాకాలంలో నిద్రపోవాలి అంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అయితే ఇలాంటి సమయంలో మనకు తొందరగా నిద్ర పట్టాలి అంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల తొందరగా నిద్రపోవచ్చు మరి ఆ చిట్కాలు ఏంటి అనే విషయానికి వస్తే…మనం నిద్రపోవడానికి రెండు గంటల ముందు ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటిని కూడా దూరం పెట్టాలి. లాప్టాప్ మొబైల్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఇక నిద్రపోయే ముందు లైట్ ఆఫ్ చేసుకుని పడుకోవడం వల్ల తొందరగా నిద్ర పడుతుంది.
అలాగే మన గదిని కాస్త చల్లగా ఉంచడం కోసం ప్రయత్నాలు చేయాలి. ఇక రాత్రి భోజనంలో ఎక్కువగా నూనెతో తయారుచేసిన పదార్థాలను లేకుండా జాగ్రత్త పడాలి.ఈ విధంగా నూనెతో తయారు చేసిన పదార్థాలను తినటం వల్ల అజీర్తి గ్యాస్ సమస్య కారణంగా నిద్రపట్టే అవకాశాలు ఉండవు ఇక పూర్తిగా మసాలాలను కూడా తగ్గించాలి.ఇక మన పనిలో కలిగే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం కోసం యోగా ధ్యానం వంటి వాటిని చేయడం ఎంతో మంచిది. ఈ చిట్కాలను కనుక పాటిస్తే తొందరగా నిద్ర పడుతుంది.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.