Singer Sunitha : తన మాటే ఓ కమ్మని పాట. ఇక తన నోటి నుంచి ఓ పాట వస్తే చెవిలో అమృతం పోసినట్టే . ఆమె పాడే ప్రతి పాట ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. మ్యూజిక్ లవర్స్ ను సమ్మోహన పరుస్తాయి. మాట,పాటలోనే కాదు ఆమె రూపమే ఓ అందం. ఆమెనే సింగర్ సునీత. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సునీత లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది, కష్ట నష్టాలను కల్లారా చూసింది. మరి ముఖ్యంగా తను సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అందరూ ఆమెను టార్గెట్ చేశారు ఎంతోమంది ట్రోల్ చేశారు. అయినా వాటన్నిటిని తట్టుకుని నిలబడింది సునీత. ఓవైపు తన ఎదిగిన పిల్లలకు సపోర్టుగా ఉంటూనే మరోవైపు తన భర్త ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది. పిల్లలు కూడా సునీత నిర్ణయాన్ని ఎప్పుడూ కాదనలేదు. చానాళ్ళ తర్వాత సునీత ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో ఆమె వ్యక్తిగత విషయాలను షేర్ చేశారు.
” ప్రతి ఒక్కరి లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ కామన్. వాటన్నిటిని తట్టుకుని నిలబడటమే గొప్ప విషయం. నా జీవితంలో ఇలాంటివి చాలా జరిగాయి.కానీ వాటిని నేను మర్చిపోయాను. ఒక్కోసారి మా రిలేటివ్స్ అప్పుడలా జరిగింది నువ్వు చాలా బాధ పడ్డావు అంటూ గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకో కానీ వాటన్నిటిని నేను మర్చిపోయాను. నన్ను చాలామంది మోసం చేశారు. ఇక నా గురించి వచ్చిన రూమర్స్ కైతే లెక్కే లేదు. నాన్నకు బిజినెస్ లో లాస్ రావడంతో ఫైనాన్షియల్ సపోర్ట్ గా ఉండేందుకు 17 ఇయర్స్ లోనే నేను నా సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేశాను. 19 ఏళ్లకే నాకు వివాహం జరిగిం ది. చిన్న వయసులోనే నా భుజాన పెద్దపెద్ద బాధ్యతలు అన్నీ మోశాను. పిల్లలు పుట్టినా కెరీర్ ను ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను.
లైఫ్ లో ఫైనాన్సియల్ గా స్ట్రాంగ్ గా ఉండాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. 35 ఏళ్లు వచ్చేవరకు కష్టపడుతూనే ఉన్నాను. నా చుట్టూ ఉన్నవారే నన్ను మోసం చేశారు. మోసపోయిన ప్రతిసారి షాక్ అయ్యేదాన్ని. నా నవ్వును చూసి అంతా ఫేక్ అని విమర్శించే వారు చాలామంది ఉంటారు. అలా అన్న ప్రతిసారి నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆ నవ్వు వెనుక ఉన్న బాధలు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
నా 25 ఏళ్ల అనుభవంలో 5000కు పైగా షోలల్లో పాడి ఉంటాను. నా గొంతు బాగోదని హస్కిగా ఉంటుందని చాలామంది ఎల్లో రకాలుగా నన్ను విమర్శించారు. కొన్ని కారణాల వల్ల నేను చాలా షోలను మిస్ చేశాను కూడా. అసలు నా లైఫ్ లో ఏం జరిగిందో మీకు ఏం తెలుసు? పర్సనల్గా ఎన్ని బాధలు అనుభవించినా స్టూడియోలోకి వెళ్ళగానే అవన్నీ మర్చిపోవాలి ప్రొఫెషనల్ గా ఉండాలి నేను అదే చేసేదాన్ని. నిజానికి నేను చాలా సెన్సిటివ్. కొన్ని విషయాల్లో తట్టుకోలేక ఏడ్చేస్తాను నా లైఫ్ లో నేను చేసిన మంచి పని అంటూ ఏదైనా ఉంటే అది రెండో పెళ్లి చేసుకోవడమే” అని ఎమోషనల్ అయింది సునీత.
Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.