Health care: మన శరీరంలో ప్రతి భాగం కూడా ఎంతో కీలకమైనదని చెప్పాల. మన శరీరంలో ఏ భాగమైన అనారోగ్యానికి గురైన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మన శరీరంలో కీలక పాత్ర పోషించే భాగాలలో లివర్ కూడా ఉంది.ఇది శరీరంలోని మురికిని తొలగిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. రక్త కణాల నిర్మాణంలో కూడా లివర్ కీలకపాత్ర పోషిస్తుంది అయితే రాత్రిపూట కనుక మన శరీరంలో ఇలాంటి లక్షణాలు కనబడుతున్నాయి అంటే మన లివర్ పాడైపోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
మరి ఎలాంటి లక్షణాలు లివర్ అనారోగ్యాన్ని గుర్తుచేస్తాయి అనే విషయానికి వస్తే..మీరు రాత్రిపూట పదేపదే మేల్కొంటే, అది కాలేయం దెబ్బతినడానికి సంకేతం కావచ్చు. కాలేయం దెబ్బతినడం వల్ల నిద్ర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇక రాత్రి సమయంలో మీ శరీరం చాలా దురదగా ఉంటుంది. ఇలా శరీరం ఎప్పుడైతే దురద పెడుతుందో అప్పుడు మీ కాలేయం ఆరోగ్యంగా లేదని అర్థం.
కాలేయం దెబ్బతినడం వల్ల పాదాలు, చీలమండలలో వాపు కనిపిస్తుంది. ఈ వాపు రాత్రిపూట ప్రత్యేకంగా కనిపిస్తుంది. అదేవిధంగా రాత్రిపూట వికారం వాంతులు వంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి.కాలేయం దెబ్బతినడం వల్ల మూత్రం పసుపు రంగులోకి మారవచ్చు. కాలేయం ఉత్పత్తి చేసే బిలిరుబిన్ అనే పదార్ధం పెరగడం వల్ల ఇది వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనుక మీకు రాత్రి పూట కనిపించినట్టయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం వల్ల కాలేయాన్ని కాపాడుకున్నట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.