Categories: EntertainmentLatest

Shruti Haasan : రెండో ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిన శ్రుతిహాసన్

Shruti Haasan : కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతిహాసన్. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా తనకున్న మల్టీటాలెంట్ తో కొద్ది రోజుల్లోనే స్టార్డమ్ సంపాదించింది. గాయనిగా ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోయిన్‏గా క్రేజ్ సంపాదించుకుంది శ్రుతిహాసన్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. ప్రేక్షకులను అలరించింది. కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నా శ్రుతికి రియల్ లైఫ్ లో మాత్రం సినిమా కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ బ్యూటీకి ప్రేమ పెద్దగా అచ్చిరావడంలేదని అర్థమవుతోంది. తాజాగా ఈ భామ తన రెండో ప్రియుడికి బ్రేకప్ ఇచ్చినట్లు రూమరస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే శ్రుతి ప్రియుడి ఫోటోలను డిలీట్ చేయడంతో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.

shruti-haasan-love-breakup-with-boyfriend-santanu-hazarika

శ్రుతి హాసన్ మొదట లండన్‎కు చెందిన ఫోటోగ్రాఫర్‏తో ప్రేమాయణం కొనసాగించింది. వీరిద్దరి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హమ్మయ్యా శ్రుతి త్వరలో ఓ ఇంటిదవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో కొన్నిరోజులకే అతడికి బ్రేకప్ చెప్పేసింది. అయితే బ్రేకప్ కు గల కారణాలను మాత్రం చెప్పలేదు. ఫస్ట్ బ్రేకప్ తర్వాత చాలాకాలం సింగిల్ గానే ఉంది. సినిమాల కూడా పెద్దగా చేయలేదు. ఆ తర్వాత క్రాక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ దూసుకెళ్తోంది.

shruti-haasan-love-breakup-with-boyfriend-santanu-hazarika

మొదటి బ్రేకప్ తర్వాత శ్రుతి శంతను హజారికతో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరి నాలుగైదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. వీలు కుదిరినప్పుడల్లా వీరిద్దరూ ఇన్ స్టాగ్రామ్ లో ఫన్నీ రీల్స్ డ్యాన్స్ రీల్స్ చేసేశారు. ఆ వీడియోలు నెట్టింట్లో హల్ చల్ కూడా చేశాయి. ఇక ఈవెంట్స్ లో జోడీగా పాల్గొంటూ సోషల్ మీడియాలో ఈ కపుల్ ట్రెండ్ అయ్యేవారు. అయితే గత కొన్నిరోజులుగా వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు కానీ వీడియోలు కానీ నెట్టింట్లో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఇద్దరు విడిపోయారా ? అన్న రూమర్స్ ఆ మధ్య తెగ వినిపించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇద్దరూ ఇన్ స్టాలో ఒకరినొkకరు అన్ ఫాలో చేయడంతో ఈ రూమర్స్ కు బలం చేకూరినట్లైంది. అంతే కాదు శంతనుతో దిగిన ఫోటోలను శ్రుతి తాజాగా డిలీట్ కూడా చేసింది. దీంతో శ్రుతి శంతనుకు బ్రేకప్ చెప్పిందన్న క్లారిటీ వచ్చింది. కానీ ఈ విషయంపై వీరిద్దరూ ఇంకా రెస్పాండ్ కాలేదు.

Sri Aruna Sri

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

2 weeks ago

This website uses cookies.