Shruti Haasan : నాన్న చెప్పినా వినను..నాకు భయం లేదు : శృతి హాసన్

Shruti Haasan : చిత్ర పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అని అనుకుంటారు అందరూ. కానీ అది కేవలం ఇండస్ట్రీలో అడుగుపెట్టేవరకే వర్తిస్తుందని చాలామందికి తెలియదు. అలా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన చాలా మంది ఒకటి రెండు సినిమాల తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయిన వారు చాలా మందే ఉన్నారు. అతి కొద్ది మంది మాత్రమే ఈ పరిశ్రమలో తమ టాలెంట్ తో నిలదొక్కుకున్నారు. అలాంటి వారిలో యంగ్ బ్యూటీ శృతి హాసన్ ఒకరు. తమిళ సూపర్ స్టార్, లెజెండ్ యాక్టర్ కమల్ కూతురనే బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చిన ఈ చిన్నది ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడింది. సరైన హిట్స్ లేక ఐరెన్ లెగ్ అనే పేరు కూడా మోసింది. కానీ అవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అని నిరూపించింది ఈ బొమ్మ. తన టాలెంట్ తో అటు తమిళం ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ జనరేషన్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. యంగ్ హీరోస్ తో పాటు అగ్ర కథానాయకుల సరసన హీరోయిన్ గా నిటిస్తూ తన సత్తా చూపుతోంది.

shruti-haasan-couldnt-fallow-my-father-ideas-says-south-star-actress

శృతి హాసన్ చాలా స్ట్రెయిట్ పార్వర్డ్ గా ఉంటుంది. బ్రెయిన్‌ చెప్పింది బ్లైండ్‌గా ఫాలో అయ్యే హీరోయిన్ శృతిహాసన్‌. విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ కూతురైనా శృతి ఐడియాలజీ వేరు. నటన, అందం విషయంలో శృతి తండ్రికి తగ్గ కూతురే అయినప్పటికీ ఆమె స్టైలే వేరు. కేవలం నటి మాత్రమే కాదు కమల్ లాగా ఈ బ్యూటీ బహుముఖ ప్రజ్ఞాశాలి. అందంతో కవ్విస్తుంది , నటనతో ఆకర్షిస్తుంది, తన గాత్రం . సంగీతంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. నిజానికి శృతి ముందు సంగీత దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది, ఆ తర్వాత హీరోయిన్ గా , సింగర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

shruti-haasan-couldnt-fallow-my-father-ideas-says-south-star-actress

బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శృతి ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్‌ను దాటి హాలీవుడ్‌ స్థాయికి చేరుకుంది. తమిళంలో ఏఆర్‌ మురుగదాస్‌ డైరెక్షన్ లో ఏళామ్‌ అరివు అనే సినిమాకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది శృతి . మొదటి సినిమాలోనే బలమైన పాత్రను పోషించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఎందుకనో శృతిహాసన్‌ను తమిళ చిత్ర పరిశ్రమ పెద్దగా ఆదరించలేదన్న ఆరోపణలు వచ్చాయి.

 

తెలుగు సినిమాల్లో శృతికి చెప్పుకోదగ్గ మంచి హిట్లు ఉన్నాయి. ఈ బ్యూటీ తాజాగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ సరసన సలార్ మూవీలో కథానాయకుడిగా నటిస్తోంది. కేజీఎఫ్‌ మూవీ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసింది. ఈ భారీ బడ్జెట్‌ మూవీ డిసెంబర్‌ 22వ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా శృతిహాసన్‌ ఒక సమావేశంలో మాట్లాడుతూ ప్రభాస్‌కు ప్రాముఖ్యతను ఇస్తూ రూపొందించిన సలార్ మూవీలో తాను ఒక భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది.

shruti-haasan-couldnt-fallow-my-father-ideas-says-south-star-actress

సలార్ మూవీ యూనిట్‌ తనను తనలానే ఉండేలా షూటింగ్‌ను అనుభవించేలా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే సలార్ మూవీకీ పోటీగా హిందీ సినిమా డంకీ రిలీజ్ కాబోతోంది. అయితే దీని గురించి తనకు ఎలాంటి భయం లేదని శృతి తెలిపింది. అందుకు కారణాన్ని కూడా వివరించింది. సలార్ పై తమకు నమ్మకం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక మరోవైపు హాలీవుడ్‌లో తాను నటిస్తున్న ది ఐ మూవీ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆవిష్కరించే స్టోరీతో వస్తోందని తెలిపింది. అయితే కొంతమంది తనను మంత్రగత్తె అంటూ తప్పుగా అర్థం చేసుకుంటారని చెప్పుకొచ్చింది. అలా అయినా నాకు గర్వంగానే ఉందని తన భావాన్ని వ్యక్తం చేసింది. ఇకపోతే తన తండ్రి సలహాలు తనకు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయని శృతి పేర్కొంది. అయినప్పటికీ వాటిని తాను పాటించుకోలేకపోతానని చెప్పుకొచ్చింది.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

22 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

24 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.