Shani Trayodashi: శనీశ్వరుడు ప్రతి ఒక్కరికి వారు చేసే కర్మల ఆధారంగా వారికి తగ్గ ప్రతిఫలం అందిస్తుంటారు. ఇలా శని ప్రభావ దోషం కనుక మనపై పడింది అంటే ఎన్నో కష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.శనీశ్వరుని ప్రభావం కనుక మనపై ఉంటే ఎన్నో అవంతరాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఉద్యోగాలలో ఆటంకాలు ఉద్యోగం ఆలస్యం కావడం ఇంట్లో చికాకులు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వంటివి తలెత్తుతూ ఉంటాయి. ఈ విధంగా ఇలాంటి సమస్యలు కనుక ఉన్నాయి అంటే తప్పకుండా శని ప్రభావం వారిపై ఉందని అర్థం.
ఈ విధమైనటువంటి శని ప్రభావ దోషాలతో బాధపడేవారు ఈ దోషాల నుంచే విముక్తి పొందడం కోసం ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఈ పరిహారాలను పాటించడానికి శని త్రయోదశి ఎంతో ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ఇలా శని త్రయోదశి రోజు శనీశ్వరుడికి ప్రత్యేకంగా పూజ చేయడం వల్ల శని దోష పరిహారం కలుగుతుంది దీంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు. మరి శని త్రయోదశి రోజు శనీశ్వరుడిని ఎలా పూజించాలి అనే విషయానికి వస్తే…
శని త్రయోదశి రోజు సూర్యోదయాన్ని కంటే ముందుగా నిద్రలేచి తలంటూ స్నానం చేసి దగ్గరిలో ఉన్నటువంటి శనీశ్వరుని ఆలయానికి వెళ్లి స్వామి వారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లటి వస్త్రం శనీశ్వరుడికి సమర్పించి నవధాన్యాలతో పుష్పాలతో పూజించాలి. నల్లటి నువ్వులను నల్ల వస్త్రాలను శని త్రయోదశి రోజు దానం చేయటం వల్ల ఈ దోషాలు తొలగిపోతాయి.ఇక శనివారం రోజున మహావిష్ణువు లక్ష్మీదేవి అశ్వర్ధ వృక్షంపై ఉంటారని భావిస్తారు. అందుకే శనీ త్రయోదశి రోజు అశ్వర్థ వృక్షాన్ని పూజించడం ఎంతో శుభసూచికం. ఉపవాస దీక్షతో శని త్రయోదశి రోజు అశ్వర్థ వృక్షం చుట్టూ ప్రదక్షణలు చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.