Shani Dosham: సాధారణంగా అందరి దేవుళ్లకు భక్తితో దండం పెడతారు. కానీ శని దేవుడికి మాత్రం భయంతో దండం పెడతారు. ఎందుకంటే శని దేవుడిని పూజించేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అయితే కొంతమంది శని దోషం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటివారు ఈనెల 19న శనిజయంతి రోజున శని దేవున్ని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభించడమే కాకుండా శని దోషం కూడా తొలగిపోతుంది. శనీ జయంతి రోజున శని దేవుడిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడాది మే 19 న శని జయంతి రోజున శుభ యోగం ఏర్పడబోతోంది. మే 18న రాత్రి 07.37 గంటల నుంచి 19వ తేదీ సాయంత్రం వరకు 06.17 గంటల వరకు ఈ యోగం ఉంటుంది. శని జయంతి రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానమాచరించి శని దేవుడి విగ్రహానికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయాలి. ఆ తర్వాత పూలతో అలంకరించి,నల్ల మినప్పప్పు, నల్ల నువ్వులు నైవేద్యంగా శని పాదాల వద్ద సమర్పించాలి. ఆ తర్వాత దీపం వెలగించి శనిచాలీసా చదువుకోవాలి. అలాగే ఆ రోజంతా ఉపవాసం ఉండడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది.
శని జయంతి రోజున దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్య ఫలం దక్కుతుంది . అలాగే పేదలకు అన్నదానం చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఎదురైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అందువల్ల శని జయంతి రోజున పేదలకు సహాయం చేయడం చాలా మంచిది. ఇక
శని జయంతి రోజున సాయంత్రం పడమటి దిశలో దీపం వెలిగించాలి. ఓం శని శనైశ్చరాయ నమ: అంటూ జపం చేయాలి.
అలాగే శనీశ్వరుడి మంత్రి పఠించాలి
ఓం నీలాంజన సమాభాసం..
రవిపుత్రం యమాగ్రజం..
ఛాయామార్తాండ సంభూతం..
తం నమామి శనైశ్చరం..
ఓం శం శనైశ్చరాయ నమః
అనే మంత్రాన్ని జపించాలి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.