Shakeela : ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఆమె సినిమా రిలీజ్ అవుతుందంటే భయపడి పోయేవారు. అంతలా పాపులారిటి సంపాదించుకున్న నటి షకీలా. ఆమె ఇండస్ట్రీలో చాలా వరకు బి గ్రేడ్ సినిమాల్లో నటించింది. బోల్డ్ యాక్టర్ గా పేరు సంపాదించుకుంది. అప్పట్లో ఈమె సంపాదన కూడా ఓ రేంజ్ లో ఉండేది. బోల్డ్ నటి అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఆమెకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో షకీలా తెలిపింది.
టాలీవుడ్‌లోని ఓ స్టార్ డైరెక్టర్ టార్చర్ వల్ల సినిమాలే వదిలేశానంటూ బాంబు పెల్చింది. ఈ మధ్యనే నటి విచిత్ర చేసిన కంట్రోవర్సీ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయ్యాయి . ఈ క్రమంలో ఓ టాప్ డైరెక్టర్ ప్రవర్తన వల్ల సినిమాలకు 20 ఏళ్లుగా దూరం అయ్యాను అని సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ తండ్రి తనను అడ్జస్ట్‌మెంట్ అడిగారని ఆరోపించింది.
ఓ తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ..”విచిత్ర నా ఫ్రెండ్. మేమిద్దరం కొన్ని సినిమాల్లో నటించాం. అయితే విచిత్ర తనను ఏ హీరో గదిలోకి రమ్మన్నాడు? ఎవరి వల్ల సినిమాలు వదిలేయాల్సి వచ్చిందో చెప్తే బాగుండు.. నేను ఇప్పటికీ తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్న. అప్పట్లో నేను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.హీరో అల్లరి నరేశ్ తండ్రి, దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ఒకానొకప్పుడు నన్ను అడ్జస్ట్‌మెంట్ అడిగాడు.
అడ్జస్ట్‌మెంట్ కు ఓకే అయితే నాకు మరో సినిమలో అవకాశం ఇస్తానన్నాడు. నేను దానికి ఒప్పుకోలేదు. సర్, నాకు మూవీలో యాక్ట్ చేసినందుకు డబ్బులిచ్చేశారు. ఇంకో ఛాన్స్ అవసరం లేదు అని ఆయన ముఖం మీదే చెప్పేసాను. ఇప్పుడాయన బతికి లేరు. దీని గురించి నన్ను ఎవరు అడిగినా చెప్తాను.. అవును, ఆ రోజు ఆయన నన్ను ఆయన తన గదికి పిలిచాడు. ఇదే నిజం” అని షకీల తెలిపింది. ఇప్పుడు షకీలా చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.