Shaakuntalam Review: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శాకుంతలం. దిల్ రాజు, నీలిమ గుణ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్ విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక దేశ వ్యాప్తంగా ఏకంగా ఐదు భాషలలో ఈ సినిమాని రిలీజ్ చేశారు. మహాభారతంలో ఆదిపర్వంలో శకుంతల దుష్యంతుడి ప్రణయ ప్రేమ కావ్యాన్ని, అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకొని గుణశేఖర్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కథలోకి వెళ్తే
ఒకరోజు వేటకోసం అడవికి వెళ్ళిన దుష్యంతుడు కణ్వమహర్షి ఆశ్రమంలో ఉన్న శాకుంతలని చూస్తాడు. ఆమెని మొదటి చూపులోని మొహిస్తాడు. ఆమెతో ప్రేమ పాటలు పాడుకుంటాడు. ఇక శాకుంతల కూడా దుష్యంతుడి ప్రేమలో పడిపోతుంది. వీరిద్దరూ గాందర్వ వివాహం చేసుకుంటారు. ఇక రాజ్యానికి వెళ్లి తిరిగి వచ్చి తీసుకొని వెళ్తానని యువరాణిగా పరిచయం చేస్తానని శాకుంతలకి మాట ఇస్తారు. తరువాత రాజ్యానికి వెళ్ళిన దుష్యంతుడు తిరిగిరాడు. దీంతో గర్భవతి అయిన శకుంతల తన గుర్తింపు కోసం పోరాటం చేస్తుంది. ఆమెని దుష్యంతుడు ఎందుకు మరిచిపోయాడు. చివరికి భార్యగా శకుంతలని స్వీకరించడా అనేది కథలో భాగంగా ఉంటుంది.
ఇక మూవీలో శాకుంతల పాత్రలో సమంత అద్భుతమైన నటనతో మెప్పించింది. దుష్యంతుడి పాత్రకి దేవ్ మోహన్ పూర్తి న్యాయం చేశారు. కథలో భాగంగా వచ్చే అన్ని పాత్రలు ఎవరి పరిధి మేరకు వారు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. పెర్ఫార్మెన్స్ పరంగా ఎవరికీ ఓంక పెట్టడానికి లేదు. అయితే అసలు సమస్య అంత కథ, కథనంలోనే ఉంది. అందరికి తెలిసిన కథనే దర్శకుడు గుణశేఖర్ తెరపై ఆవిష్కరించారు. ఇలాంటి కథని తెరపై ఆవిష్కరించినపుడు ఎంత ఎమోషనల్ గా ప్రేక్షకులని కథకి, పాత్రలకి కనెక్ట్ అయ్యే విధంగా చేసాము అనేదాని మీద సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
ఈ విషయంలో గుణశేఖర్ తడబడ్డాడు అని చెప్పాలి. స్లో నేరేషన్, ఎంగేజ్ చేయని స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు ఎక్కడా కనెక్ట్ కాలేకపోతాడు. దానికి తోడు మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏ కోణంలో మెప్పించాలేదనే మాట ఆడియన్స్ నుంచి వినిపిస్తోంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్, త్రీడీ కోసం భారీగా ఖర్చు చేసిన చాలా ఆర్టిఫీషియల్ గా గ్రాఫిక్స్ వర్క్ ఉందని చెప్పాలి. పాత్రల పెర్ఫార్మెన్స్ వరకు చూడాలంటే సినిమాకి ఒకసారి వెళ్ళొచ్చు.. అయితే లాంగ్ రన్ లో ఏ మేరకు ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పిస్తుంది అనేదానిపై సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.