Kriti Sanon : సినిమా హీరోయిన్స్ పెళ్లికి పనికిరారు అంటూ క్రేజీ హీరోయిన్ కృతి సనన్ సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన 1 నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దోచేయ్ సినిమానూ చేసింది. కానీ, ఈ రెండు సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. దాంతో కృతీసనన్ మళ్ళీ తెలుగులో కనిపించలేదు.
కానీ, హిందీ సీమలో మాత్రం స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీని సంపాదించుకొని భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు కృతీ ఎక్కువగా పాన్ ఇండియన్ సినిమాలను కమిటవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి కృతీ ప్రభాస్‌తో చాలా క్లోజ్ అయ్యారు. దాంతో సోషల్ మీడియాలో ప్రభాస్-కృతీసనన్ ప్రేమించుకుంటున్నారనీ, పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడైనట్టు ప్రచారం చేస్తున్నారు.
దాంతో ఇటీవల బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ అంటే ఎలా చూస్తున్నారో..ఇంట్లో ఎలాంటి ప్రశ్నలు వేస్తారో చెప్పుకొచ్చింది. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా వెళతానంటే అదో తప్పులా భావిస్తున్నారనీ, సొంతవాళ్ళే ఆశ్చర్యంగా చూస్తున్నారనీ చెప్పారు. అందుకే, కొందరు అమ్మానాన్నలు తమ కూతుళ్ళని హీరోయిన్‌గా ఎంకరేజ్ చేయడం లేదన్నారు. సమాజంలో హీరోయిన్‌కి అంత గౌరవం లేదనీ, పెళ్లి చేసుకోవాలంటే ఎవరూ ఆసక్తి చూపించరనీ వాపోయింది.
ఈ విషయంలో నన్ను కూడా చాలామంది భయపెట్టారనీ చెప్పిన కృతీ గత రెండు దశాభ్దాలుగా సినిమా ఇండస్ట్రీలోకి తెలుగమ్మాయిలు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినవారు చాలా తక్కువన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులతో పాటు చాలామంది నెటిజన్స్ కృతీ సనన్ మాటలను ఏకీభవిస్తున్నారు. ఇక చాలా ఏళ్ళ తర్వాత కృతీ తెలుగులో చేస్తున్న ఆదిపురుష్ సినిమాతో ఇక్కడ క్రేజ్ తెచ్చుకుంటారేమో చూడాలి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.