Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ యంగ్ బ్యూటీ శ్రీలీల. దసరా పండుగ సందర్భంగా విడుదలైన భగవంత్ కేసరీ చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. పెళ్లి సందడి, ధమాకా చిత్రాలతో హిట్స్ అందుకొని వరుస ఆఫర్స్ అందుకుంటున్న శ్రీలీల ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ దక్కడంతో ఆనందంలో మునిగి తేలుతుంది. బ్యాక్ టు బ్యాక్ రవితేజ, బాలకృష్ణ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ అంటే గొప్ప విషయమే.
ధమాకా సినిమా తర్వాత దాదాపు 10 సినిమాలలో శ్రీలీల నటించే అవకాశం అందుకుంది. పవన్ కళ్యాణ్ సినిమా, వైష్ణవ్ తేజ్ సినిమా, విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు తెలుగులో కొత్త ప్రాజెక్ట్ అనుకుంటే దానికోసం ముందు శ్రీలీల డేట్స్ లాక్ చేయడానికే మేకర్స్ ట్రై చేస్తున్నారు. ఓ రెండేళ్ళ పాటు ఈ కుర్రభామ డేట్స్ దొరకడం కష్టమంటున్నారు. ఇంత బిజీగా ఉన్న శ్రీలీల మరోవైపు బ్రాండ్ అంబాసిడర్ గా కమర్షియల్ యాడ్స్ చేస్తూ బిజీగా ఉంది.
ఇప్పుడు దర్శక, నిర్మాతలే కాదు కుర్ర హీరోలు శ్రీలీల కావాల్సిందే అని పట్టుపడుతున్నారు. అంతేకాదు, భగవంత్ కేసరి సినిమాలో అమ్మడి పర్ఫార్మెన్స్ చూసిన సీనియర్ హీరోలు సైతం ఆ తరహా కథల కోసం, అందులో శ్రీలీల కావాలని మేకర్స్ ని అడుగుతున్నారట. బాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఈ ట్రెండ్ ఇప్పుడు తెలుగులో బాలయ్య మొదలు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున లాంటి వారు కూడా ఇప్పుడు భగవంత్ వంటి కథ కోసం వేట మొదలు పెట్టారట.
అంతేకాదు, ఈ సీనియర్ హీరోలకి శ్రీలీలతో నటించాలనే ఆరాటం మొదలైనట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో కుర్రభామ కెరీర్ చిక్కుల్లో పడనుందా..? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతీ సినిమాలో ఇలా కూతురు పాత్రల్లో నటించడానికి ఒప్పుకుంటే త్వరగానే శ్రీలీల కెరీర్ ఖతం అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. చూడాలి మరి రానున్న ప్రాజెక్ట్స్ లో ఎలాంటి చిత్రాలను ఓకే చేస్తుందో.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.