Satyam Rajesh: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పాపులర్ కమెడియన్స్‌లో సత్యం రాజేష్ ఒకరు. సత్యం, మిర్చి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి ఫాంలో ఉన్నాడు. క్షణం లాంటి కొన్ని సినిమాలలో సీరియస్ రోల్స్ కూడా చేశాడు. ఇప్పుడు సత్యం రాజేష్ నటించిన పొలిమేర 2 రిలీజ్ కాబోతుంది. గత కొంతకాలంగా మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ముఖ్యంగా తెలుగు, తమిళ భాషలలో కథ, అందులోని సన్నివేశం డిమాండ్ చేస్తే నటీనటులు ఒంటిపై ఏమీ లేకుండా కూడా నటించడానికి సిద్ధమవుతున్నారు.
గతంలో కొన్ని సినిమాలలో హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాకుండా కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా నగ్నంగా నటించారు. ఇప్పుడు సత్యం రాజేష్ కూడా అలా నగ్నంగానే నటించారు. ముఖ్య పాత్రలో తెరకెక్కిన పొలిమేర 1 ఓటీటీలో రిలీజై సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమాతో నటీనటీలందరికీ మంచి పేరు వచ్చింది.
ఈ క్రమంలో ఇప్పుడు పొలిమేర-2 ని తెరకెక్కించారు. ట్రైలర్ రిలీజైయ్యాక ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. దాంతో మొదటి భాగం లా కాకుండా ఈ చిత్రాన్ని నేరుగా థియేటర్లలోనే విడుదల చేస్తుంది చిత్రబృందం. ఈ నేపథ్యంలో షూటింగ్ సమయంలో తన అనుభవాల్ని సత్యం రాజేష్ మీడియాతో పంచుకున్నారు. ‘పొలిమేర మొదటి భాగం షూటింగ్ సమయంలో నా సన్నివేశాలు తీస్తున్నప్పుడు నాకే భయమేసింది.
అర్దరాత్రి రెండున్నర గంటల సమయంలో స్మశానంలో కొన్ని సీన్లు షూట్ చేశాము. కొన్ని సన్నివేశాల్లో నగ్నంగానూ నటించాను. లైట్లన్నీ ఆపేసి ఒకే ఒక్క లైట్ లో సీన్లు తీసారు. ‘పొలిమేర 2′ లో కొన్ని భయపెట్టే సీన్స్ ఉన్నాయి. హారర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమాని విదేశాల్లోనూ రిలీజ్ చేస్తున్నాం. నా జీవితంలో ఇదే పెద్ద మూవ్ మెంట్’ అని చెప్పుకొచ్చాడు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.