SandeepVanga-Mahesh Babu : సందీప్ వంగ.. ఈ పేరు చెప్తే అర్జున్ రెడ్డి సినిమా కళ్ల ముందు కనిపిస్తుంది. ఫస్ట్ మూవీ తోనే స్టార్డమ్ సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్. హిందీలోనూ అర్జున్ రెడ్డిని రీమేక్ చేసి తెలుగులో కంటే హిందీలో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీర్ రణ్బీర్ కపూర్తో చేసిన యానిమల్ మూవీ డిసెంబర్ 1 విడుదల కానుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సందీప్ వంగ యానిమల్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇంటర్వ్యూలో మహేశ్‌బాబు గురించి మాట్లాడుతూ… “మహేష్ కు ఓ స్టోరీ చెప్పాను. ఆయనకు అది ఎంతో బాగా నచ్చింది. ఆయతే ప్రస్తుతం వేరే సినిమాలు చేస్తుండటం వల్ల మా మూవీ వర్కౌట్ కాలేదు. డార్లింగ్ ప్రభాస్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌తో మూవీస్ పూర్తి అయ్యాక మహేష్, రామ్‌చరణ్ లతో మూవీ చేస్తాను. వీరే కాదు చాలామంది హీరోలతో సినిమాలు చేయాలని ఉంది. ఇప్రభాస్ తో తీయబోయే మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది”అని డైరెక్టర్ చెప్పాడు.
యానిమల్ మూవీకి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తండ్రి కొడుకుల బాండింగ్ చుట్టూనే తిరిగింది. ఈ ట్రైలర్ తో సెంటిమెంట్ తో పాటు యాక్షన్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది. సినిమా మొత్తం కూడా బాలీవుడ్ నటులతోనే నిడిపోయినా.. సౌత్ నేటివిటీకి తగ్గట్టు మూవీ ఉందంటున్నారు విశ్లేషకులు. దీనితో సినిమాపై మరిన్ని అంచనాలు భరీగా ఉన్నాయి. సందీప్ వంగా డైరెక్షన్ కావడంతో తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజులో విధ్వంసం చేయబోతుందో డిసెంబర్ 1 వరకూ వెయిట్ చెసి చూడాల్సిందే.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.