Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగ ఈ డైరెక్టర్ కు పెద్దగా పరిచయం అవసరం లేదు. అటు తెలుగు ఇటు హిందీలో చేసింది ఒకే ఒక్క సినిమా అయినప్పటికీ ఆల్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. సందీప్ సినిమా తీస్తున్నాడంటే అందరి చూపు ఆయనవైపే ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమాతో అంతలా ఇండస్ట్రీని రాక్ చేశాడు ఈ డైరెక్టర్. బాలీవుడ్లో నూ కబీర్ సింగ్ తో సక్సెస్ సాధించాడు.ఇక ఇప్పుడు అర్జున్ రెడ్డి మించి యానిమల్ సినిమాను వెండితెర మీద ప్రదర్శించబోతున్నాడు ఈ డైరెక్టర్. రీసెంట్ గా విడుదలైన యానిమల్ ట్రైలర్ తో సినిమా ఏ లెవెల్ లో ఉంటుందో చెప్పకనే చెప్పేసాడు. సినీ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాడు. ఇప్పటికైతే ఈ సినిమాపై అంతటా కూడా పాజిటివ్ టాక్ నడుస్తోంది. బాక్స్ ఆఫీస్ ను అనిమల్ మూవీస్ షేక్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.
యానిమల్ సినిమా సందీప్ వంగ తీస్తున్నాడని తెలిసినప్పటి నుంచి దీనికి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.అయితే ఇంతటి బీభత్సం వెనుక పరోక్షంగా అయితే ఒక నెగిటివ్ కామెంట్ ఉంది అని సందీప్ రెడ్డి వంగ మాటల్లో తెలుస్తోంది. సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి ని కబీర్ సింగ్ గా రీమేక్ చేసినప్పుడు అక్కడ కొంతమంది మీడియా వారు ఆ మూవీ పై నెగటివ్ కామెంట్స్ చేశారు.. బాలీవుడ్ ప్రముఖ సినీ విశ్లేషకుడు రాజీవ్ మసంద్ కూడా కబీర్ సింగ్ వైలెంట్ గా ఉందని నెగిటివ్ రివ్యూ ఇచ్చారు.
అప్పట్లో సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఆ నెగటివ్ కామెంట్ కు దీటుగా జవాబిచ్చాడు. అసలు కబీర్ సింగ్ మూవీ లో వయలెన్స్ అనేది లేదని అసలైన వైలెంట్ అంటే ఏంటో తర్వాత చూపిస్తా అని అప్పుడే సవాల్ విసిరాడు. ఆ కసితోనే సందీప్ రెడ్డి యానిమల్ తీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ తోనే సినిమా ఎలా ఉంటుందో చూపించాడు. హీరో అరాచకం, విలన్స్ ను ఊచకోత కోసే విధానం అదుర్స్ అనిపిస్తుంది. టైలరే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకుల ఊహకే వదిలేసాడు సందీప్. దీంతో మూవీ పై కావాల్సినంత బజ్ క్రియేట్ అయ్యింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.