Samyuktha Menon : టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి పట్టుమని నాలుగు సినిమాలను కూడా చేయలేదు. అప్పుడే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్. మలయాళ బ్యూటీలు చాలా అందంగా ఉంటారు. అందుకే పెద్దగా టాలెంట్ లేకపోయినా అందంతో హీరోయిన్‌గా సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ సంయుక్తా మీనన్ కి అందంతో పాటు మంచి పర్ఫార్మర్ అనే పేరు కూడా బాగానే వచ్చింది.
దాంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ వస్తోంది. మామూలుగా అయితే, మనవాళ్ళు ఒకటీ లేదా రెండు సినిమాల తర్వాత ఇదే హీరోయిన్‌కి అవకాశాలు ఇవ్వాలా వద్దా అని ఆలోచనలో పడతారు. కానీ, సంయుక్తా మీనన్ ఆ ఛాన్స్ ఎవరికీ ఇవ్వలేదు. ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు తెరకి హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్న సంయుక్తా ఆ తర్వాత బింబిసార, సార్ మూవీస్‌తో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది.
దాంతో మన టాలీవుడ్ మేకర్స్ అలాగే హీరోలు సంయుక్తాని లక్కీ హీరోయిన్ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మరోసారి పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతుంది. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ సరసన నటిస్తున్న ఈ బ్యూటీ రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన లుక్ రిలీజ్ చేస్తే అందులో తన ఫొటో లేదని ఫీలైంది.
అదే విషయాన్ని ట్వీట్‌లో మెన్షన్ చేస్తూ ఫీలైంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా బూతద్దంలో పెట్టి చూస్తూ రక రకాలుగా ప్రచారం చేశారు. దానిపై తాజాగా స్పందించిన సంయుక్తా మీనన్ ..సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌ను అస్సలు కేర్ చేయను అంటూ క్లారిటీ ఇచ్చింది. అలాంటి వాటివి నా ఏరియాలోకి రావంటూ రియాక్ట్ అయింది. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.