Samyuktha : ప్రస్తుతం పూరి జగన్నాధ్ తమిళ సీనియర్ నటుడు విజయ్ సేతుపతితో ఓ క్రేజీ మూవీని చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాధ్, ఛార్మీ కలిసి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లోకి ఆల్రెడీ సీనియర్ నటి టబు వచ్చి చేరారు. అలాగే సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ ఫిక్స్ అయ్యారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఓ క్రేజీ హీరోయిన్ కన్‌ఫర్మ్ అయింది.
సంయుక్త మేనన్ సౌత్‌లో వరుస హిట్స్ అందుకుంటూ పాన్ ఇండియా సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకున్న ఈ మలయాళ భామ బింబిసార, విరూపాక్ష సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. తెలుగు తమిళంలో నటించిన సార్ మూవీ మరో బ్లాక్ బస్టర్. దాంతో ఈ బ్యూటీకి తెలుగుతో పాటు ఇతర భాషలలోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2లో హీరోయిన్‌గా నటిస్తోంది.
Samyuktha : పూరి సినిమాతో ఆ కోరిక తీరుతుంది.
ఈ క్రమంలోనే తాజాగా పూరి జగన్నాధ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తూపొందబోతున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని పూరి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటి వరకూ సంయుక్త చేసిన పాత్రలన్నీ డీసెంట్‌గానే ఉన్నాయి. కానీ, పూరి సినిమాలో మాత్రం ఖచ్చితంగా గ్లామర్ డోస్ ఉంటుంది. ఇన్నాళ్ళు ఈ బ్యూటీని గ్లామర్‌గా చూడాలనుకున్న వాళ్లకి పూరి సినిమాతో ఆ కోరిక తీరుతుంది. మరి ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వస్తుందో చూడాలి.
పూరి జగన్నాధ్ కి ఈ సినిమా సక్సెస్ అనేది చాలా ముఖ్యం. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పూరి ఇక తిరుగుండదనుకుంటే మళ్ళీ, లైగర్..డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో ఫ్లాప్స్ చూడాల్సి వచ్చింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న పూరి, ఫైనల్ గా కొత్త ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళంతో పాటు మిగతా సౌత్ భాషలలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి బెగ్గర్, బిక్షాం దేహీ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
This website uses cookies.