Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్నా కొన్ని బంధాలు మాత్రం మూనాళ్లకే విడిపోతున్నాయి. మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంటున్న దంపతుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. సినీ పరిశ్రమలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. కొద్ది కాలంగా ఇండస్ట్రీలో డివోర్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా సమంత, చైతుల విడాకుల ప్రకటన అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. వీరిద్దరు విడిపోయి నాలుగేళ్లు అవుతున్నాయి ఇప్పటికీ సోషల్ మీడియాలో సందర్భం వచ్చిన ప్రతిసారి వీరిద్దరి గురించి నెటిజన్స్ తెగ మాట్లాడుకుంటుంటారు. ముఖ్యంగా సమంత నిత్యం వార్తల్లో ఉంటుంది. అటు సినిమాలతో పాటు ఇటు పర్సనల్ లైఫ్ గురించి నెట్టింట్లో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్యనే మయోసైటిస్ కు ట్రీట్మెంట్ తీసుకున్న సామ్ మళ్లీ తెరముందు రెట్టింపు ఉత్సాహంతో కనిపించేందుకు తెగ కష్టపడుతోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యూట్యూబ్ వేదికగా పాడ్‌కాస్ట్ ను నిర్వహిస్తోంది. ఇందులో బాగంగా పలు అంశాలపై డిస్కస్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది సామ్ . అభిమానులను పొందడం అంత ఈజీ విషయం కాదని తెలిపింది. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
” వినోదం, ఫ్యాషన్, మేకప్‌పై చాలామంది అభిమానులకు ఆసక్తి ఎక్కువ. అందుకే ఆ విషయంలో నా ఓపీనియన్ మార్చుకున్నాను. చాలా వరకు కొత్త అంశాలపై అవగాహన వచ్చింది. నా మాటలు కొద్దిమందిపై అయినా ప్రభావం చూపించినా నాకు సంతోషమే. ఈ కార్యక్రమం ద్వారా కొద్దిమందిలో అయినా మార్పు తీసుకురాగలిగితే అంతకు మించింది ఏం కావాలి. ఆ మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. నేను డిప్రెషన్ లోకి వెళ్లినప్పుడు అభిమానులే నాకు సపోర్ట్ గా నిలిచారు. నిజానికి అభిమానులను సొంతం చేసుకోవడం అంత తేలికైన పని కాదు. నిజంగా వాళ్లు నాకు దొరకడం నా అదృష్టం”అని సమంత తెలిపింది.
ఏమాయచేసావే సినిమాతో చైతన్యకు దగ్గరైంది సమంత. ఈ సినిమాలో వీరి కెమెస్ట్రీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కూడా కావడంతో ఈ పెయిర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత సమంత స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది. సౌత్ ఇండస్ట్రీలో ఈమెకు ఎక్కడ లేనంత క్రేజ్ వచ్చింది. పొట్టిదే అయితే సామ్ అందం , అభినయం అందరిని ఆకట్టుకున్నాయి. అయితే గత కొంతకాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోంది. దీనికి ట్రీట్మెంట్ కోసం ఏడాదికి పైగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ సామ్ ఫామ్ లోకి వచ్చింది. తన పుట్టినరోజు సందర్భంగా ఓ లేడీ ఓరియంటెడ్ స్టోరీతో తెరముందుకు రాబోతున్నట్లు అనౌన్స్ చేసింది సామ్. తన సొంత బ్యానర్ పైనే ఈ మూవీ తీయబోతోంది. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తోన్న సమంతకు మరో రెండు బంపర్ ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ కు హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మరో మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా చేయనున్నాడు. ఈ మూవీని సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్నాడు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.