Samantha : అవంటే నాకు భయమేస్తోంది

Samantha : స‌మంత‌ ఈ పేరు ఇండస్ట్రీలో నెట్టింట్లో నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆమెకున్న క్రేజ్ అలాంటిది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుని రాణిస్తోంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది సమంత. ఆ తర్వాత ఆమెను మ‌యోసైటిస్ వ్యాధి తీవ్రంగా ఇబ్బంది పెట్టేసింది. అనారోగ్య సమస్య వేధించినప్పటికీ సమంతా ముందుగానే ప్రామిస్ చేసిన సినిమాలన్నింటినీ పూర్తి చేసింది. ఇక సమంత పని అయిపోయిందని ఆమె ఇక సినిమాలకు సెలవు పలుకుతుందని వార్తలు వచ్చాయి. అయితే పట్టుదలతో క‌ఠినమైన వ్యాయామాలు, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మళ్లీ ఆరోగ్యంగా తయారవుతుంది. ఆమె విల్ పవర్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అందిస్తోంది. పర్సనల్ గా,ప్రొఫెషనల్ గా సామ్ చేసే పోరాటం అంద‌రినీ మేల్కొలుపుతోంది.

samantha-that-scares-me-alot-says-tollywood-star-actress

గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి సమంత అమెరికాలో మ‌యోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. ఈమధ్యనే ఫారెన్ కంట్రీస్ లో న్యూ ఇయర్ నీ సెలబ్రేట్ చేసుకున్న ఈ చిన్నది ఇప్పుడు ఒక కొత్త విష‌యం చెప్పి ఆశ్చర్యపరిచింది. సమంతకు పువ్వులు అంటే చాలా అలెర్జీ అట. అంతే కాదు వాటిని అందుకోవడం అంటే ఆమెకు భయమేస్తుందని ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో తెలిపింది. ఫ్లవర్ బుకే ని అందుకున్న ఆనందకరమైన విషయాన్నీ గుర్తు చేసుకుంటూ ఆ ఫోటోను ఫాలోవర్స్ తో షేర్ చేసింది. అదే సమయంలో పువ్వుల‌తో త‌న‌కు ఉన్న ప్రాబ్లెమ్ గురించి చెప్పింది సమంత. ఆ పువ్వుల వ‌ల్లే తాను ఎమర్జెన్సీ రూమ్ లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది

samantha-that-scares-me-alot-says-tollywood-star-actress

సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం తన వ్యక్తిగత విషయాలు ప్రొఫెషనల్ ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. ఫాలోవర్స్ ఆమెని ఎంతగా అభిమానిస్తారో, కొంతమంది ఆమెని ట్రోలింగ్ కూడా చేస్తూ ఉంటారు. విడాకుల తర్వాత సమంతను రేంజ్ లో ట్రోల్ చేశారు. సమంత సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి తెలిపింది. ” ఇది అంత ఈజీ కాదు, నాను సోషల్ మీడియాలో ఇంతటి ఫాలోయింగ్ వస్తున్నందుకు సంతోషిస్తున్నాను. నేను నిజాయితీగా నా వీక్నెస్, , స్ట్రెంత్ ని చెప్పడం నాకు చాలా సంతృప్తిని అందిస్తోంది. అయితే కొన్నిసార్లు నా పోస్టుల ద్వారా నేను ట్రోలర్స్ కు టార్గెట్ అయ్యాను. నేను నా మనసు మార్చుకుని ఉండవచ్చు, కానీ ఇది ఒక స్వీటెస్ట్ ప్లేస్”అని తెలిపింది. ప్రస్తుతం ఈ కొత్త ఏడాదిలో సిటాడెల్ ప్రమోషన్స్ కోసం స‌మంత రెడీ అవుతోందని స‌మాచారం. ఆ తర్వాత తన లేటెస్ట్ ప్రాజెక్టుల గురించి అనౌన్స్ చేసే అవ‌కాశం ఉందని టాక్.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.