Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత భర్త అక్కినేని నాగ చైతన్యతో డివోర్స్ తీసుకుని చాలా కాలం అవుతుంది. ఇటు చై, అటు సమంత ఇద్దరూ ఇప్పుడు ఎవరి లైఫ్ ను వారు లీడ్ చేస్తున్నారు. ఓవైపు సమంత సొంత ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసి బాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తుంటే మరోవైపు చై సినిమాల్లో ప్రయోగాలు చేస్తూ తన స్టార్డమ్ నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. విడిపోయినప్పటి నుంచి వీరిద్దరూ ఎప్పుడూ ఎదురుపడలేదు. ఒకరి గురించి మరొకరు ప్రత్యక్షంగా ఎక్కడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం లేదుని కానీ కొంత మంది ట్రోలర్స్ మాత్రం సమంతను టార్గెట్ చేస్తూ ఈ చేదు అనుభవాన్ని ఏదో రకంగా గుర్తుచేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు ఓ ట్రోలర్ నుంచి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. దానికి సామ్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆ కౌంటర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం వీరి కాపురం బాగానే సాగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ జంట విడిపోవాల్సి వచ్చింది. విడిపోయిన తర్వాత సమంత సోషల్ మీడియా వేధికగా కొన్ని ఎమోషనల్ పోస్టులు పెట్టేది. మానసికంగా బలంగా ఉండేందుకు ప్రయత్నించేది. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోయారు? పెళ్లికి ముందు ఉన్న ప్రేమ ఇప్పుడేమైంది? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పటికీ జనాల్లో ఉన్నాయి. కానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం వారి నుంచి రాలేదు. కానీ దాని వెనక ఉన్న బాధను లోలోపలే వీరిద్దరూ భరిస్తూ పైకి నవ్వుతూ కనిపిస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేని కొంత మంది సమంతను టార్గెట్ చేస్తున్నారు. డివోర్స్ తీసుకుని మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆమెను విమర్శించడం ఆపడం లేదు. రీసెంట్ గా సామ్ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఓ వీడియోను వీడియో షేర్ చేసింది. అయితే ఈ వీడియో గురించి మాట్లాడకుండా ఓ నెటిజన్ ఆమె పర్సనల్ విషయాలను మాట్లాడి లిమిట్ క్రాస్ అయ్యాడు.
అమాయకుడైన నాగ చైతన్యను ఎందుకు చీట్ చేశావో చెప్పు అని సమంతను ప్రశ్నించాడు. ఈ కామెంట్ చూసిన సామ్ గట్టి రిప్లై ఇచ్చింది. ” సారీ, ఇలాంటి పనులు మీకు అంతగా వర్కౌట్ కాకపోవచ్చు. మీకు మరిన్ని స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా” అని దండం పెడుతున్న ఓ ఎమోజీని జత చేసి ట్రోలర్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది సమంత. ఇది చూసిన ఫ్యాన్స్ సమంతను మెచ్చుకుంటున్నారు. నిన్ను కిందకు దించాలని ప్రయత్నించే ట్రోలర్స్‌కు ఇలాగే ఇచ్చిపడేయ్, ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.