Samantha Ruth Prabhu : నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంతకు పెద్దగా కలిసి రావట్లేదని చెప్పాలి. సినిమాలపరంగా ఈ భామ వరుసగా హ్యాట్రిక్ ఫ్లాపులు తన ఖాతాలో జమ చేసుకుంది. ఇది చాలదన్నట్లు మయోసైటిస్ తో గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది సమంత. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి బయట పడుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. సినిమాలకు బ్రేక్ చెప్పే మరి తన ఆరోగ్యం పై దృష్టి పెట్టింది. చాలా రోజుల బ్రేక్ తర్వాత సమంత మళ్ళీ ఇతర ముందు కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ క్రమంలో సమంత గతంలో సైన్ చేసిన ఓ మూవీ నుంచి తప్పుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ స్థానాన్ని శృతిహాసన్ కొట్టేసిందని తెలుస్తోంది.
సమంత, శృతిహాసన్ ఒకప్పుడు ఇద్దరు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్. ఇప్పటికీ ఈ ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న నేపథ్యంలో వీరిద్దరికీ కాస్త సినిమా ఛాన్సులు తగ్గుతున్నాయి కానీ ఫాలోయింగ్ విషయంలో వీరిద్దరూ సూపర్ స్టారులే. సమంత వ్యాధి బారిన పడటంతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంది. కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాలను ఎలాగోలాగా పూర్తి చేసింది. యశోద, శకుంతలం, ఖుషి ఇలా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులే. ఈ సినిమాలు పూర్తి కాగానే మళ్లీ రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది.
ఇక శృతిహాసన్.. టాలీవుడ్ కి కాస్త బ్రేక్ ఇచ్చినా గత సంక్రాంతి నుంచి మళ్లీ తన సందడి మొదలు పెట్టింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి సీనియర్ హీరోల సినిమాలతో పాటు లేటెస్ట్ గా సలార్ కనిపించి మళ్ళీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. సలార్ సెకండ్ పార్ట్ షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ క్రమంలో శృతిహాసన్ మరో క్రేజీ ప్రాజెక్టుని అందుకుంది. సమంత చేయాల్సిన మూవీ లో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
2021లో సమంత ఒక ఇంటర్నేషనల్ మూవీ చేయబోతోందని అధికారికంగా అనౌన్స్ చేశారు.. ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే బుక్ ఆధారంగా ఫిలిప్ జాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హాలీవుడ్ మూవీలో డిటెక్టివ్ పాత్రలో సమంత నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సెట్స్ మీదకు రాలేదు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మూవీ షూటింగ్ ఇప్పుడు స్టార్ట్ కానుందట. అయితే ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న సమంత ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు న్యూస్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు నుంచి సమంత తప్పుకోవడంతో ఆ స్థానంలో శృతిహాసన్ను తీసుకున్నట్లు సమాచారం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.