Samantha Ruth Prabhu : సమంత రిజెక్ట్ చేయడం వల్లనే..వరుణ్-లావణ్యల పెళ్లి జరిగిందా?

Samantha Ruth Prabhu : ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడాకులు తీసుకోవడం చిత్ర పరిశ్రమలో కామనే. కానీ కొద్ది మంది మాత్రమే వారి రిలేషన్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. రిలేషన్స్ ను సీరియస్ తీసుకునే వారంతా గుట్టుచప్పుడు కాకుండా ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తుంటారు. అందరూ అవక్కయ్యేలా పెళ్లి చేసుకుని ఓ ఇంటివారవుతుంటారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా అదే పని చేశాడు. ఒకటా రెండా ఏకంగా ఐదేళ్ల పాటు నటి లావణ్య త్రిపాఠితో ప్రేమాయణాన్ని కొనసాగించి ఈ మధ్యనే ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. లావణ్య, వరుణ్ పెళ్లి జరిగినప్పటి నుంచి వీరిద్దరికి సంబంధించిన వర్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం పెళ్లి హడావిడిని ముగించుకుని ఈ కపుల్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ హాలిడే టూర్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలను అప్పుడప్పుడు అలా సోషల్ మీడియాలో వదులుతూ లావణ్య ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది.

samantha-ruth-prabhu-is-the-reason-for-varun-tej-and-lavanya-tripathi-marriage

వరుణ్ లావణ్యల ప్రేమ కథ ఇప్పటిది కాదు 2017 నుంచి ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అప్పట్లో శ్రీను వైట్ల డైరెక్షన్ లో లావణ్య , వరుణ్ కలిసి నటించారు. ఆ మూవీనే మిస్టర్. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వరుణ్ లావణ్యల మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత వీరి మధ్య బాండింగ్ ఏర్పడింది. ఇన్నాళ్లు వీరి లవ్ స్టోరీని ఎక్కడా రివీల్ చేయకుండా చాలా సీక్రెట్ గా ఉంచారు. పెళ్లి డేట్ ఫిక్స్ కాగానే తమ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఈ జంట పెళ్లి తంతును ముగించుకుని హనీమూన్ లో ఎంజాయ్ చేస్తుంది. అయితే వీరిద్దరు ప్రేమించుకోవడానికి మాత్రం హీరోయిన్ సమంతే కారణమని ప్రస్తుతం వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి ప్రేమకు సమంతకు మధ్య సంబంధం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే వాస్తవానికి శ్రీ వైట్ల రూపొందించిన మిస్టర్ మూవీలో ముందుగా హీరోయిన్ గా సమంత అనుకున్నారట. అయితే సమంత ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయడం వల్ల ఆ అవకాశం లావణ్యకు వచ్చిందట.

samantha-ruth-prabhu-is-the-reason-for-varun-tej-and-lavanya-tripathi-marriage

సామ్ ఒకవేళ ఈ ప్రాజెక్టులో నటించినట్లైతే కచ్చితంగా వరుణ్.. లావణ్యని చూసే అవకాశమే వచ్చేది కాదు. వీరి మధ్య ప్రేమ ఉండేది కాదు పెళ్లి కూడా జరిగి కాదు. ఇలా మూవీకి నో చెప్పడం వల్ల సమంత పరోక్షంగా వారి పెళ్లికి కారణమైందన్న న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

samantha-ruth-prabhu-is-the-reason-for-varun-tej-and-lavanya-tripathi-marriage

ఇదిలా ఉంటే సమంత ఇప్పుడు యాక్టింగ్ పక్కన పెట్టి కొత్త ఉద్యోగం మొదలు పెట్టింది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నఈ భామ లేటెస్టుగా ఒక్కసారిగా టీవీ స్క్రీన్ మీద మెరిసిపోయింది. సమంత మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్‌తో బాధపడుతున్న విషం తెలిసిందే. దీనిని నుంచి బయటపడేందుకు సినిమాలకు కొన్నాళ్లు విరామం ప్రకటించింది. సినిమాలు చేయకపోయినప్పటికీ అమ్మడు అద్భుతమైన ఫోటో షూట్లతో , యాడ్స్ తో అలరిస్తోంది. తాజాగా రియాలిటీ షో MTV హస్టిల్ కనిపించి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది . ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు బాలీవుడ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దీంతో అమ్మడిని ఇలా జడ్జిగా చూస్తూ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

samantha-ruth-prabhu-is-the-reason-for-varun-tej-and-lavanya-tripathi-marriage

సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్‌ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ వెబ్ సిరీస్ పూర్తికాగానే సామ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో సమంత నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ మూవీకి సమంత హీరోయిన్ గా ఎంపికైందట.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

6 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

7 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.