Samantha Ruth Prabhu : సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఏం చేసినా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. తన సినిమా కథలను ఎన్నుకునే దగ్గరి నుంచి ఈ బ్యూటీ ఫాలో అయ్యే ఫ్యాషన్ స్టైల్స్ వరకు అన్నీ అందరిని తప్పకుండా ఆకర్షిస్తాయి అని అనడంతో ఎలాంటి సందేహం లేదు. క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన సమంత నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తరువాత హిందూ దేవుళ్లను ఆరాదించడం మొదలు పెట్టింది. అప్పటి నుంచి సమంత వీలైనప్పుడల్లా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, జపమాలతో ధ్యానం చేయడం వంటివి చేస్తూ వస్తోంది. భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ ఈ అలవాటును మార్చుకోలేదని తెలుస్తోంది మొన్నామధ్య శాకుంతలం ట్రైలర్ నాడు జపమాలతో దర్శనమిచ్చింది సామ్. తాజాగా సమంత పళనిలోని మురుగన్ ఆలయంలోనూ ప్రత్యేక పూజలను నిర్వహించింది. మురుగన్ ఆలయానికి వెళ్లిన సమంత పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమంతా రూత్ ప్రభు ప్రస్తుతం కండరాల నొప్పులకు కారణమయ్యే ఆటో ఇమ్యూన్ కండిషన్ అయిన మైయోసిటిస్ నుండి కోలుకుంటున్నట్లు ఈ పిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ మధ్యనే వరుణ్ ధావన్ తో కలిసి రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో చేస్తున్న సీటాడెల్ షూటింగ్‌లోనూ పాల్గొంటోంది సామ్. ముంబై షూటింగ్ లో బిజీగా గడుపుతున్నా.. ఆధ్యాత్మిక వ్యక్తి అయిన సమంత తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించి తన మొక్కులను చెల్లించుకుంది. సమంత దాదాపు 600 మెట్లు ఎక్కి, కర్పూర దీపం వెలిగించింది. తన బృందంతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలను చేసి అర్చకుల ఆశీర్వాదాలను తీసుకుంది. చెమటలు పడుతున్నా ఏమాత్రం డైవర్ట్ కాకుండా తన మొక్కులను ఎంతో నిష్టగా చెల్లించుకుంది సమంత.
సమంతతో పాటే 96, జాను సినిమాలకు పనిచేసిన దర్శకుడు ప్రేమ్ కుమార్ కూడా ఆలయానికి వచ్చారు. ఆలయ సందర్శన కోసం సమంత సాధారణ సల్వార్ సూట్ ధరించింది. ఆమె ముఖానికి నల్లటి మాస్క్ పెట్టుకుంది. ఆమె సిబ్బందితో పాటు ప్రేమ్ కుమార్ కూడా పిక్స్‌లో ఉన్నారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 17 న విడుదల అవుతుందని అనుకున్న శాకుంతలం సినిమాను ఏప్రిల్ 14కు పోస్ట్ పోన్ చేశారు చిత్ర నిర్మాతలు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ 14 సినిమా కానుందని ఇటీవలె అధికారికంగా చిత్ర యూనిట్ ధృవీకరించింది. శాకుంతలం చిత్రంలో, సమంత మేనక, విశ్వామిత్రల కుమార్తె శకుంతల ప్రధాన పాత్రను పోషిస్తుంది. గుణశేఖర్ నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ గుణశేఖర్‌తో సమంతా మొదటి సారి నటిస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.