Salaar : ప్రస్తుతం టాలీవుడ్ లో సలార్ మేనియా నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పేరే ట్రెండింగ్ లో ఉంది. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 22న విడుదల కానుంది. ప్రభాస్ ఫ్యాన్స్, ప్రశాంత్ నీల్ అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన సెకెండ్ ట్రైలర్ దుమ్ముదులుపుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అభిమానులు కొత్త అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే మేకర్స్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నారు. లేటెస్టుగా సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆయనపై ప్రశంసలు వర్షం కురిపించారు.
ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ..”సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను సెకండ్ హీరోగా ఒప్పించడం సాధ్యమవుతుందా అని అనుకున్నాను. కానీ కథ నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చెప్పారు. సలార్ లోని వరదరాజ మన్నార్ క్యారెక్టర్ లో ఒదిగిపోయే హీరో కోసం చాలా కసరత్తు చేశాం. చాలా మంది బాలీవుడ్ హీరోలను ట్రై చేయవచ్చు కదా అని సలహాలిచ్చారు. కానీ నా మైండ్ లో పృథ్వీరాజ్ ఉన్నారు. ఈ క్యారెక్టర్ కి ఆయన్నే తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. ప్రేమ, ద్వేషం ఈ రెండింటిని చూపించగల సత్తా పృథ్వీలో మాత్రమే ఉంది. పృథ్వీ ఒక నటుడిలా కాదు కొన్ని సన్నివేశాల్లో దర్శకుడిలా ఆలోచిస్తారు. నిజానికి ఇండస్ట్రీలో ఆయనకు ఉత్తమ అసిస్టెంట్ డైరెక్టర్ అని టైటిల్ ఇవ్వొచ్చు. సలార్ విషయంలో ఆయన నాతో ఎన్నో ఐడియాలను పంచుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పృథ్వీ లేకపోతే సలార్ లేదు”. అని ప్రశాంత్ నీల్ తెలిపారు.
బాహుబలితో పాన్ ఇండియా స్టారైన ప్రభాస్ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత చేసిన మాస్ మూవీ ‘సలార్’. ఈ సినిమాలో తన మాస్ యాక్షన్ తో ఇరగదీసేందుకు రెడీ అయ్యాడు ప్రభాస్. డిసెంబరు 22న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి మూవీ రిలీజ్ కానుంది. దీనితో పలుచోట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో అభిమానులు టికెట్ల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా హీరో నిఖిల్ ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసం 100 టికెట్లను ఫ్రీ గా ఇస్తానని బంపర్ ఆఫర్ అనౌన్స్ చేశాడు. ఇదిలా ఉంటే ఆఫ్‌లైన్‌లో టికెట్లపై పాపం ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సలార్ టికెట్ల ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బెంగళూరులో సింగిల్ స్క్రీన్ టికెట్ ధర అక్షరాలా రూ. 600 పైనే పలుకనుందట, ఇక మల్టీఫ్లెక్స్‌ల్లో అయితే రూ.1000-రూ.1200 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు ఉందని టాక్ వినిపిస్తోంది. మరిఈ న్యూస్ లో ఎంత నిజముందో ఇంకా తెలియాల్సి ఉంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.