Salaar Trailer : బాహుబలి మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. దర్శకధీరుడు జక్కన్న తీసిన మూవీతో ప్రభాస్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు. అయితే పాపం ఆ సినిమా తరువాత ప్రభాస్ సరైన హిట్టు లేక అప్సెట్ లో ఉన్నాడు. భారీ బడ్జెట్ చిత్రాలు చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పటంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆదిపురుష్ అయినా హిట్ అవుతుందని ఆశిస్తే అది కూడా డార్లింగ్ ఫాన్స్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్ చూపు ప్రభాస్ చూపు అంతా కూడా సలార్ వైపే ఉంది. కే జి ఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది ఫాన్స్ లో అంచనాలను ఒక్కసారిగా పెంచేస్తుంది.
సలార్ సినిమా డిసెంబర్ 22 న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మూవీ యూనిట్ ప్రమోషన్ మొదలుపెట్టేసింది సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా హోంబలే ఫిల్మ్స్ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ప్రభాస్ ఫాన్స్ కు పిచ్చెక్కిస్తోంది. సినీ అభిమానులను సైతం ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్ ను బట్టి చుస్తే, సాలార్ మూవీ ‘ఖాన్సార్’ నగరం చుట్టూ సాగినట్టు తెలుస్తోంది. భారీ యాక్షన్ మూవీ గా సలార్ ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ సినిమాలో హింసాత్మక దృశ్యాలు, రక్తపాతం, ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. కే జి ఎఫ్ ను మించి భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని సమాచారం. అయితే యష్ కన్నా ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇటు తెలుగు, అటు హిందీ లోనూ డార్లింగ్ కు మంచి క్రియేట్ ఉంది. పైగా ఇది ప్రశాంత్ నీల్ సినిమా కాబట్టి అక్కడ కూడా సాలార్ మూవీ కి మంచి ఆదరణే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సలార్ సినిమాలో ప్రభాస్ మెకానిక్ గా కనిపించబోతున్నాడని ట్రైలర్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వెహికల్స్ పాడైతే ఎలా రిపేర్ చేస్తాడో అలా మనుషులను కూడా రిపేర్ చేస్తాడని ఇన్ డైరెక్ట్ గా డైరెక్టర్ చెప్పేస్తున్నాడు. ప్రభాస్ లోని హీరోయిజాన్ని ప్రశాంత్ నీల్ ట్రైలర్ లో బాగా హైలైట్ చేశాడు. ఇక ప్రభాస్ తనదైన గంభీరమైన వాయిస్ తో ఫాన్స్ లో పూనకాల తెప్పించాడు. ఈ ట్రైలర్ లో ప్రభాస్ తన మిత్రుడు పృథ్వి రాజ్ సుకుమారన్ కోసం ఏదైనా చేసేందుకు వెనకాడాడు అన్నట్లు చూపించాడు. కానీ ట్రైలర్ చివర్లో మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. ఇద్దరు ప్రాణ మిత్రులు బద్ధ శత్రువులుగా మారితే అని డైరెక్టర్ కథలోని ట్విస్ట్ ని ఎలివేట్ చేస్తూ మరి చెప్పాడు. ఈ ఒక్క మాటతో ఈ చిత్రంపై ఆసక్తి పెంచేశాడు ప్రశాంత్ నీల్. బాహుబలి సినిమా కూడా డైరెక్టర్ రాజమౌళి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని మొదటి పార్టీ రిలీజ్ అయినప్పుడు ప్రశ్న ను వదిలాడు. అదే విధంగా ఇప్పుడు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.